AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Manifesto: నవరత్నాల ప్లస్ పేరుతో మేనిఫెస్టో.. వారికి రుణాలపై వడ్డీ మాఫీ!

సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో రెడీ అయింది. దూరమైన వర్గాలకు దగ్గరయ్యేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. వైసీపీ మేనిఫెస్టోను మరికొద్ది గంటల్లో తాడేపల్లి వేదికగా సీఎం జగన్ విడుదల చేస్తారు. మేనిఫెస్టోలో ఏఏ అంశాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.

YCP Manifesto: నవరత్నాల ప్లస్ పేరుతో మేనిఫెస్టో.. వారికి రుణాలపై వడ్డీ మాఫీ!
Ycp Manifesto
Balaraju Goud
|

Updated on: Apr 27, 2024 | 7:40 AM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గడియాలు రానే వచ్చాయి. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత మేనిఫెస్టో రెడీ అయింది. దూరమైన వర్గాలకు దగ్గరయ్యేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. వైసీపీ మేనిఫెస్టోను మరికొద్ది గంటల్లో తాడేపల్లి వేదికగా సీఎం జగన్ విడుదల చేస్తారు. మేనిఫెస్టోలో ఏఏ అంశాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.

ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ.. మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని.. అమలయ్యే హామీలను పొందుపర్చి స్పెషల్‌గా మేనిఫెస్టోను రూపకల్పన చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు నవరత్నాలు పేరుతో తెచ్చిన రెండు పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవడంతో.. అన్నివర్గాలను ఆకర్షించేలా ఈసారి దానిప్లేస్‌లో నవరత్నాల ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో రెడీ చేశారు. ఇవాళ 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి రేపటినుంచి ప్రజాక్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఇచ్చిన ప్రతీ అంశాన్ని అమలుచేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లు టాక్.

ఇక, గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత.. పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్.. ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారికోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్. వారితోపాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు సీఎం జగన్.

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2014 కూటమి మేనిఫెస్టోపై ప్రతి సభలో విమర్శలు చేస్తూనే.. మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు జగన్. తాము మాత్రం మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిలుగా భావించి.. అందులో చెప్పిన ప్రతీ అంశాన్ని అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు అమలు చేయని హామీలు ఇవ్వనని.. అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయింది. ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సుయాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్‌గా ప్రజా మేనిఫెస్టో.. నవరత్నాల ప్లస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…