AP Elections: చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎన్నికల సంఘం షాక్.. పెండింగ్‌లో ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌

చీరాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌కు షాక్ తగిలింది. అతని నామినేషన్‌‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్‌లో పెట్టారు ఎన్నికల సంఘం అధికారులు. నామినేషన్ స్కూటినీ ఈరోజు అంటే ఏఫ్రిల్ 27న చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ నాగార్జున రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణమోహన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు పెండింగ్‌లో పెట్టారు.

AP Elections: చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎన్నికల సంఘం షాక్.. పెండింగ్‌లో ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌
Amanchi Krishna Mohan
Follow us

|

Updated on: Apr 27, 2024 | 8:12 AM

చీరాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌కు షాక్ తగిలింది. అతని నామినేషన్‌‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్‌లో పెట్టారు ఎన్నికల సంఘం అధికారులు. నామినేషన్ స్కూటినీ ఈరోజు అంటే ఏఫ్రిల్ 27న చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ నాగార్జున రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణమోహన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు పెండింగ్‌లో పెట్టారు. అలాగే, నామినేషన్ పత్రాల్లో కొన్ని పత్రాలు జతచేయలేదని పెండింగ్ పెట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. సరియైన పత్రాలు అందజేస్తే నామినేషన్ ఆమోదిస్తామని తెలిపారు.

బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ నుంచి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చాన్స్‌ దక్కకపోవడంతో కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అమంచి కృష్ణమోహన్ రూ. 4.63 కోట్ల విద్యుత్‌ బకాయిలతోపాటు, అక్రమాలు, అరాచకాలు, హత్యలు చేశారంటూ ఎన్నికల అధికారులకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను మరోసారి స్క్రూట్నీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా, అమంచి నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఎదురైన ఈ అభ్యంతరాలపై ఆమంచి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, 2009లో కాంగ్రెస్‌, 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్‌, అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీ టికెట్ దక్కించుకుని బరిలోకి దిగారు. కానీ టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో చీరాలలో ఆమంచి హవానే నడిచింది. అయితే అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించి తన కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలో చేర్చారు. కానీ కరణం, ఆమంచి మధ్య ఏ మాత్రం పొసగలేదు. ఒకేవరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు.. ఈ ఇద్దరినీ ఒకే నియోజకవర్గంలో ఉంచడం కరెక్ట్ కాదని భావించిన వైసీపీ హైకమాండ్.. ఆమంచిని పర్చూరుకు పంపించింది. దీంతో వైసీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో మరోసారి చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరి బరిలో నిలిచే అంశం ఏమవుతుందో చూడాలి మరి.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..