YSR Rythu Bharosa: అన్న‌దాత‌లకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. గురువారం ‘రైతు భ‌రోసా’ తొలి విడుత నిధులు విడుద‌ల‌

ఖ‌రీప్ పంట‌కాలానికి ముందుగానే రైత‌న్న‌లు ఆర్థిక చేయూత ఇవ్వాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. కాగా జ‌గ‌న్ స‌ర్కార్ ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం’...

YSR Rythu Bharosa: అన్న‌దాత‌లకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్..  గురువారం 'రైతు భ‌రోసా' తొలి విడుత నిధులు విడుద‌ల‌
Ysr Raithu Bharosa

ఖ‌రీప్ పంట‌కాలానికి ముందుగానే రైత‌న్న‌లు ఆర్థిక చేయూత ఇవ్వాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. కాగా జ‌గ‌న్ స‌ర్కార్ ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం’ కింద ఈ నెల 13వ తేదీన మొదటి విడత సొమ్ము రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ లాంఛనంగా విడుదల చేయ‌నున్నారు. తొలివిడతగా రూ4,003 కోట్లను రైతుల ఖాతాల్లో 7,500 రూపాయల చొప్పున జమ చేయనుంది ప్ర‌భుత్వం. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు.

2019–20 సంవత్సరం నుంచి ఏపీ ప్ర‌భుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తుంది. తొలి విడత మేలో రూ.7500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేల చొప్పున అన్న‌దాత‌ల‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత సంవ‌త్స‌రంతో పోల్చితే ఈ ఏడాది అద‌నంగా మ‌రికొంత‌మంది రైతులకు  లబ్ధి కలుగుతోంది. ఇప్పటి వరకు వైఎస్సార్ రైతు భరోసా కింద 13,101 కోట్లు సాయం అందించింది జగన్ ప్రభుత్వం. కోవిడ్ కష్టకాలంలోనూ  ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండాల‌ని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు.

Also Read: వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

బైక్‌పై నవదంపతులు.. హృదయపూర్వకంగా పోలీసుల సన్మానం.. ఎందుకో తెలుసా..?