Viral Video: బైక్‌పై నవదంపతులు.. హృదయపూర్వకంగా పోలీసుల సన్మానం.. ఎందుకో తెలుసా..?

ఒకప్పుడు పెళ్లంటే.. తాటాకు పందిళ్లు, సన్నాయిమేళాలు..పెద్దల హడావిడి..ఐదు రోజుల పెళ్లి. కాలం మారింది. పెళ్లిళ్ల స్టైల్ మారింది. బరాత్‌లు, సంగీత్‌లు ఇలా ఎన్నెన్నో ఆర్భాటాలు వచ్చి చేరాయి...

Viral Video: బైక్‌పై నవదంపతులు.. హృదయపూర్వకంగా పోలీసుల సన్మానం.. ఎందుకో తెలుసా..?
Newely Married
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2021 | 3:33 PM

ఒకప్పుడు పెళ్లంటే.. తాటాకు పందిళ్లు, సన్నాయిమేళాలు..పెద్దల హడావిడి..ఐదు రోజుల పెళ్లి. కాలం మారింది. పెళ్లిళ్ల స్టైల్ మారింది. బరాత్‌లు, సంగీత్‌లు ఇలా ఎన్నెన్నో ఆర్భాటాలు వచ్చి చేరాయి. ఇది నిన్నమొన్నటి వరకు.. కానీ కరోనా వచ్చింది. కాలం మళ్లీ మారింది..ఇప్పుడంతా కరోనా కాలం..హంగూ ఆర్భాటాలు లేవు. ఫ్రెండ్స్ లేరు..వాళ్లు చేసే సందళ్లు లేవు. సింపుల్ గా.. వెరీ సింపుల్‌గా 25 నుంచి 50 మంది అతి ముఖ్యమైనవారితో సరిపెట్టుకొని పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతే సింపుల్‌గా బైక్‌పై వెళ్తోన్న ఓ నూతన జంటకు పోలీసులు సన్మానం చేశారు. మామూలుగా పెళ్లిబరాత్‌ అంటే.. హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. పాటలు డ్యాన్స్‌లు, డీజే సౌండ్లుతో హోరెత్తిపోతుంది. కనీసం ఓ చిన్నపాటి ఊరేగింపు అయినా ఉంటుంది. కానీ, ఇక్కడ కొత్తగా పెళ్లైన నవ దంపతులు ఇద్దరే బైక్‌పై వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పెళ్లి దుస్తుల్లోనే బయల్దేరారు. అది చూసిన స్థానిక పోలీసులు వారిని ఆపారు.. కరోనా కట్టడికి సహకరించి ఇలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నందుకు ఆ కొత్తజంటను అభినందించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించి పెళ్లి చేసుకున్న ఆ జంటను పూల దండలతో సన్మానించారు. కానుకగా కొంత నగదు కూడా బహుకరించారు. కాగా, పంజాబ్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఛత్తీస్ ఘడ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి తన అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. కోవిడ్‌ కల్లోలంలో ఆర్బాటాలకు వెళ్లకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న నవదంపతులను నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆశ్వీరదిస్తూ..శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:   ఏడాదిలో ఎప్పుడైనా తిరుమ‌ల వెంక‌న్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!

ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!