పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి ఇజ్రాయెల్ రాయబారి ప్రగాఢ సంతాపం , దేశమంతా చింతిస్తోందని వ్యాఖ్య
ఇజ్రాయెల్ లోని ఏష్కలాన్ సిటీలో పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ కుటుంబానికి ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తీవ్ర సంతాపాన్ని తెలిపారు...
ఇజ్రాయెల్ లోని ఏష్కలాన్ సిటీలో పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ కుటుంబానికి ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం తరఫున తాను సౌమ్య కుటుంబంతో మాట్లాడానని, ఆమె మృతికి మొత్తం దేశమంతా చింతిస్తోందని ఆయన పేర్కొన్నారు. సౌమ్య, సంతోష్ దంపతుల 9 ఏళ్ళ కుమారుడికి కూడా ఆయన ప్రత్యేకంగా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. సౌమ్య మృతి దురదృష్టకరమని, ఈ కుటుంబం కోసం తానిక్కడికి వచ్చినట్టు భావిస్తున్నానని రాన్ మాల్కా అన్నారు. వీరి కుమారుడు ‘ఆదన్’ తల్లి లేకుండా పెరగాల్సిందేనని ఆయన అంటూ 2008 లో ముంబై పేలుళ్లలో తన తలిదండ్రులను కోల్పోయిన =చిన్నారి మోసెస్ గురించి ప్రస్తావించారు. వీరికి దేవుడు ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ముంబై పేలుళ్ల సంఘటన నాటికి మోసెస్ వయస్సు రెండున్నర ఏళ్ళు మాత్రమే.. కాగా సౌమ్య మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు . ఆమెకు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నట్టు తెలిసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి సేవ చేసేందుకు కేరళకు చెందిన నర్సులు ఎక్కువగా శ్రమిస్తున్నారని శశిథరూర్ పేర్కొన్నారు. కాగా కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన సౌమ్య నిన్న సాయంత్రం కేరళలోని తన భర్తతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా పాలస్తీనా రాకెట్ దాడిలో మృతి చెందింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరాటం జరుగుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).