చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి మళ్ళీ మూడో సారి పదవీ యోగం ఉందా ? ‘స్వయంకృతాపరాధాలే ఆయనకు ముప్పుగా పరిణమిస్తాయా ?
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మూడోసారి తమ దేశాధ్యక్షుడవుతారా ? మళ్ళీ మూడో సారి ఆయనకు పదవీ యోగం ఉందా ? పలువురు నిపుణులు ఇవే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మూడోసారి తమ దేశాధ్యక్షుడవుతారా ? మళ్ళీ మూడో సారి ఆయనకు పదవీ యోగం ఉందా ? పలువురు నిపుణులు ఇవే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తైవాన్, హాంకాంగ్ ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి, ఇండియాతో గాల్వన్ ఉదంతంతో తెచ్చుకున్న తలనొప్పి..ఇలా అనేక సమస్యలు ఆయనకు ముచ్చటగా మూడోసారి పదవీ యోగానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలోని లడాఖ్ లో గాల్వన్ లోయలో నాడు భారత దళాలకు, చైనా ట్రూప్స్ కి జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది మృతి చెందగా చైనా సోల్జర్స్ 40 మంది మరణించారు., ఇది దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఆయనకు ‘ముప్పు’ నే తెచ్చిపెట్టింది. ఇక హాంకాంగ్ విషయానికే వస్తే దానిపై పెత్తనం వహించేందుకు జిన్ పింగ్ ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. తమపై చైనా ఆధిపత్యాన్ని సహించబోమని హాంకాంగ్ వాసులు ఎలుగెత్తి చాటారు. అమెరికా-చైనా మధ్య లోగడ జరిగిన ట్రేడ్ వార్ సైతం జిన్ పింగ్ ని చిక్కుల్లో పడేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య ఇది సుదీర్ఘకాలం సాగింది. చైనా పట్ల ట్రంప్ ఎప్పటికప్పుడు ఆగ్రహం ప్రదర్శిస్తూ వచ్చారు. మరో వైపు తైవాన్ కూడా తమను చైనా తమ దేశంలో అంతర్భాగంగా గుర్తించాలని చేస్తున్న ప్రకటనలను తీవ్రంగా గర్హిస్తోంది.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తోనూ జిన్ పింగ్ ఒకరకంగా ‘తగవు’ తెచ్చుకున్నారు. మారిసన్ కోల్డ్ వార్ మైండ్ సెట్ తో ఉన్నారని, ఆయన భావాలు వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ ఆస్ట్రేలియాతో ఆర్థికపరమైన చర్చలని పింగ్ రద్దు చేసుకున్నారు.అమెరికా డిజైన్ చేసిన హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (మిసైల్ డిఫెన్స్ సిస్టం) ని సౌత్ కొరియా స్వాగతించగా చైనా టూరిజం శాఖ దీన్ని తోసిపుచ్చింది. అమెరికా మిత్ర దేశమైన దక్షిణ కొరియా పట్ల జిన్ పింగ్ ప్రభుత్వం గుర్రుగానే ఉంది. 2018 నుంచి చైనా ఇమేజీ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ తరుణంలో జిన్ పింగ్ ప్రభుత్వం తగిన సమాచారాన్ని ఇతర దేశాలతో షేర్ చేసుకోకుండా మొండికేసింది. ఇది కూడా ఆయన స్వయంకృతాపరాధమే.. చైనాలో పత్రికా స్వేఛ్చ తప్పుడు పంథాలో పయనిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గూగుల్, ఫేస్ బుక్ అంటే పింగ్ భయపడే పరిస్థితి నెలకొంది. ఈ కోవిడ్ సమయంలో చైనా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవకుండా ఒంటెద్దు పోకడలకు పోతోంది. ఇందుకు ఆ దేశంలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న ఆరోపణలను మొండిగా తిరస్కరించడమే..ఏతా వాతా జీ జిన్ పింగ్ కి మళ్ళీ పదవీ యోగం లేదనే సందేహాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి ఇజ్రాయెల్ రాయబారి ప్రగాఢ సంతాపం , దేశమంతా చింతిస్తోందని వ్యాఖ్య
Viral Video: బైక్‌పై నవదంపతులు.. హృదయపూర్వకంగా పోలీసుల సన్మానం.. ఎందుకో తెలుసా..?