US shooting: పుట్టినరోజు పార్టీకి పిలవలేదని ఆరుగురిని కాల్చేశాడు..అమెరికాలో కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు..
US shooting: అమెరికాలో కొలరాడోలో ఆదివారం పుట్టినరోజు పార్టీలో కాల్పులకు తెగబడ్డ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముగిసింది. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
US shooting: అమెరికాలో కొలరాడోలో ఆదివారం పుట్టినరోజు పార్టీలో కాల్పులకు తెగబడ్డ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముగిసింది. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురిని కాల్చిచంపిన దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. నిందితుడు ఈ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు అనే అంశంలో పోలీసుల దర్యాప్తులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆరోజు జరిగిన పుట్టినరోజు పార్టీకి తనను పిలవలేదనే కోపంతోనే నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు. ఇది గృహహింస చర్యగా వారు చెబుతున్నారు. షూటర్, 28 ఏళ్ల టియోడోరో మాకియాస్, బాధితులలో ఒకరైన, 28 ఏళ్ల సాండ్రా ఇబారాతో ఒక సంవత్సర కాలంగా కలిసి ఉంటున్నాడు.
ఇతనికి అసూయా గుణం చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఇతనికి నేరచరిత్ర ఏమీ లేదని పోలీసులు చెప్పారు. కొలరాడో స్ప్రింగ్స్ పోలీసు లెఫ్టినెంట్ జో ఫ్రాబ్బీలే మీడియాకు మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఘటనకు ముందు వారం అక్కడ మరొక కుటుంబ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కుటుంబ సభ్యులతో మాకియాస్ ఘర్షణ పడ్డాడు. ఈ ఘటన జరిగిన రోజు రెండు కుటుంబాల కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, ముందువారం జరిగిన ఘర్షణ దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి నిందితుడు మాకియాస్ ను పిలవలేదు. ఆ కోపంతోనే అతను పార్టీ జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు జరిపాడని పోలీసులు నిర్దారించారు.
అయితే, అతనికి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఇంకా తేలలేదు. ఈ ఆయుధాన్ని ఫ్రాబ్బీల్ స్మిత్ అండ్ వెస్సన్ చేతి తుపాకీగా పోలీసులు చెప్పారు. వాస్తవానికి దీనిని 2014 లో స్థానిక తుపాకీ దుకాణంలో వేరొకరు కొనుగోలు చేశారని చెప్పారు. అది ఈ షూటర్ వద్దకు ఎలా వచ్చిందనేది తెలియాల్సి వచ్చింది. ముష్కరుడి వద్ద రెండు 15-రౌండ్ మ్యాగజైన్‌లు ఉన్నాయి, వాటిలో ఒకటి ఖాళీగా ఉంది.అదేవిధంగా ఘటనా స్థలంలో దొరికిన 17 షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పార్టీలో పదిమంది ఉన్నారు. ముష్కరుడు లోపలికి ప్రవేశిస్తూనే కాల్పులు మొదలు పెట్టాడు. ఆరుగురిని వెంట వెంటనే కాల్చిన అతను.. తరువాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే.. మూడు ఫోన్ కాల్స్ ఆ ఘటన గురించి పోలీసులకు వచ్చాయి. మొదటి కాల్ ఆ ఇంటి నుంచి పోలీసులకు వచ్చింది. తరువాత పార్టీలోని ఘటన నుంచి తప్పించుకోగలిగిన ఒక వృద్ధురాలి వద్ద నుంచి వచ్చింది.
షూటింగ్‌కు ముందే ముగ్గురు యువకులు పార్టీ నుంచి వెళ్లిపోయారని లెఫ్టినెంట్ జో ఫ్రాబ్బీలే చెప్పారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారు కొద్దిసేపటికే తిరిగి వచ్చారు. సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చిన అధికారులు జోస్ గుటిరెజ్ లోపల తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు; నిందితుడు ఇంట్లో ఉన్నట్లు అతను అధికారులకు చెప్పాడని ఫ్రాబ్బీలే చెప్పారు. గుటిరెజ్ తరువాత ఆసుపత్రిలో మరణించాడు.
కాగా, కొలరాడాలో ఇంతకుముందు చాలా కాల్పుల ఘటనలు జరిగాయి. సూపర్ మార్కెట్లలోనూ, సినిమా థియేటర్లలోనూ ఎక్కువ ఘటనలు జరిగాయి. ఇలా ఇంటిలో కాల్పులు జరగటం ఇంతకు ముందు జరగలేదు అని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ సదర్స్ అన్నారు.
కొలరాడోలోని బౌల్డర్‌లో కింగ్ సూపర్స్ సూపర్‌మార్కెట్‌పై మార్చి 22 న జరిగిన దాడిలో సదర్స్ ఒక పోలీసు అధికారితో సహా 10 మంది మృతి చెందారు. డెన్వర్ శివారు అరోరాలోని ఒక సినిమా థియేటర్‌లో 2012 లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు. 70 మంది గాయపడ్డారు.
Also Read: Encounter: అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..