Minister Roja: ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు.. ఉత్సాహంగా షటిల్ ఆడిన రోజా, అంజాద్ బాషా
YSR క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2 కోట్ల నిధులను సమకూర్చాయి.
Minister Roja: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కల నెరవేరింది. ఈ రోజు మార్కాపురం ప్రాంతంలో యర్రగొండపాలెంలో నిర్మించిన ఇండోర్ స్టేడియం ను ఈరోజు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆర్ కె రోజా ప్రారంభించారు. కొంచెం సేపు మంత్రులు సరదాగా షటిల్ ఆడి ఎంజాయ్ చేశారు.
దీంతో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది. YSR క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2 కోట్ల నిధులను సమకూర్చాయి. ఆధునిక హంగులతో ఏర్పాట్లు చేసిన షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం క్రీడలకు, క్రీడా వికాసానికి స్వాగతం పలుకుతోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..