YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన నిర్ణయం.. మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణ హాజరవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.
కాగా.. వైఎస్ వివేకా మర్డర్ కేసులో కోర్టుకెళ్లిన ప్రతిసారీ సీబీఐ సంచలన విషయాలు వెల్లడిస్తోంది. అంతకుముందు విచారించిన సీబీఐ.. ఎంపీ అవినాష్‌పై రెండు నేరాలను మోపింది. ఒకటి వివేకా హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం.. ఈ రెండింటినీ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ క్రమంలోనే మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ లో ఉన్న అవినాష్.. కడపవెళ్లారు.. తాజాగా నోటీసులు ఇవ్వడంతో మళ్లీ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు.
ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ పలు మార్లు విచారించింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ వేయగా సీబీఐ కోర్టు దానిని సోమవారం కొట్టివేసింది. కొట్టివేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..