Railway Alert: విశాఖ వెళ్లే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రైలు సమయంలో మార్పు.. వివరాలివే.!

బెంగళూరు నుంచి వైజాగ్‌కు వెళ్లే రైల్వే ప్రయాణీకులకు ఈ సమాచారం. ఈ రెండు నగరాల మధ్య వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(08544) పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే.

Railway Alert: విశాఖ వెళ్లే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రైలు సమయంలో మార్పు.. వివరాలివే.!
Trains
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2023 | 3:54 PM

విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. సికింద్రాబాద్ నుంచి అనుకునేరు. కాదండీ.! బెంగళూరు నుంచి వైజాగ్‌కు వెళ్లే రైల్వే ప్రయాణీకులకు ఈ సమాచారం. ఈ రెండు నగరాల మధ్య వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(08544) పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఆ రైలు సమయంలోనే కాదు.. బయల్దేరాల్సిన స్టేషన్‌లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతీ సోమవారం 08544 నెంబర్‌తో బెంగళూరు నుంచి కుప్పం, రేణిగుంట, నెల్లూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, రాజమండ్రి, దువ్వాడ మీదుగా విశాఖపట్నానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది.

వాస్తవానికి ఈ ట్రైన్ మే 15వ తేదీన బెంగళూరు కంటోన్మెంట్(BNC) స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రైలు రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్(SMVT) రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసింది. ప్రయాణీకులు ఈ మార్పును గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. కాగా, ఈ ట్రైన్ టైమింగ్స్‌కు సంబంధించిన మార్పులను రైల్వే విచారణ నంబర్‌ 139 ద్వారా కానీ, లేదా రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్లలో తెలుసుకోవాలని సూచించారు.

అజంతా ఎక్స్‌ప్రెస్ వేళల్లోనూ మార్పు..

సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్ళాల్సిన అజంతా ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లోనూ మార్పులు జరిగాయి. ఇవాళ(మే 15) ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. దాన్ని రాత్రి 8.20 గంటలకు రీ-షెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.