AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Land Scam: అమరావతి ల్యాండ్ స్కామ్‌ దర్యాప్తులో సీఐడీ దూకుడు.. ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్!

అమరావతి భూ కుంభకోణంతో మళ్లీ ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి.. వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఆరోపణలు.. విమర్శలతో ఏపీ రాజకీయం సలసలా కాగుతోంది. ఈ క్రమంలో అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు మరింత పెంచింది. అన్ని కోణాలు పరిశీలిస్తూ దర్యాప్తు స్పీడును సీఐడీ అధికారులు పెంచారు.

Amaravati Land Scam: అమరావతి ల్యాండ్ స్కామ్‌ దర్యాప్తులో సీఐడీ దూకుడు.. ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్!
Amaravati Land Scam
Shaik Madar Saheb
|

Updated on: May 15, 2023 | 5:41 PM

Share

అమరావతి భూ కుంభకోణంతో మళ్లీ ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి.. వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఆరోపణలు.. విమర్శలతో ఏపీ రాజకీయం సలసలా కాగుతోంది. ఈ క్రమంలో అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు మరింత పెంచింది. అన్ని కోణాలు పరిశీలిస్తూ దర్యాప్తు స్పీడును సీఐడీ అధికారులు పెంచారు. క్రిమినల్‌ లా సవరణ చట్టం, 1944 కింద చర్యలు చేపట్టిన సీఐడీ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించి పనిలో పడ్డారు. మరో వైపు లింగమనేని, హెరిటేజ్‌ సంస్థకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో కనిపించని అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో లోతైన పరిశీలన చేస్తోంది. అంతేకాదు కరకట్ట గెస్ట్‌ హౌస్‌ కాకుండా ఈ క్విడ్‌ ప్రోకోలో ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మాజీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సన్నిహితుల ఆర్థిక, నగదు లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిర్వహించిన లావాదేవీలు పరిశీలించడమే కాదు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి అనేక ఆధారాలు సీఐడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది.

పూర్తి ఆధారాలతో ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేయనుంది. అటాచ్ చేసిన ఆస్తులపై కోర్టుకు వెళ్లనుంది. కోర్టు అనుమతితో ఆస్తుల విలువ లెక్కకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల విలువ తేలితే క్విడ్ ప్రోకోపై అంచనా రానుంది. ఈ నేపథ్యంలో లింగమనేని గెస్ట్‌హౌస్ తో పాటు 75,880 గజాల ప్లాట్లు అటాచ్‌.. చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తు చేస్తూ జీ.ఓ.నెం. 89 జారీ.. లింగమనేని, హెరిటేజ్‌ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. కరకట్ట నివాసం కాకుండా క్విడ్‌-ప్రో-కోలో ఇంకా ఏమైనా ఉన్నాయా?.. నారాయణ సన్నిహితులు ఆర్థిక, నగదు లావాదేవీలపై ఆరాతోపాటు.. మనీ లాండరింగ్‌కు సంబంధించి సీఐడీ పలు ఆధారాలు సంపాదించింది. క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్ 1944 కింద ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

అక్రమ కట్టడమే.. సజ్జల ఫైర్..

ఇక అక్రమ కట్టడాలని ప్రకటించిన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు నివాసం ఉండటం అడ్డగోలు చర్య అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్రమ కట్టడం అని ప్రకటించిన దాంట్లో ఎటువంటి అద్దె చెల్లించకుండా చంద్రబాబు ఎందుకు ఉన్నారు, ఉంటున్నారని ప్రశ్నించారు. సీఐడీ అన్నది చంద్రబాబో, జగనో ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదని, అది ఎప్పటి నుంచో ఉన్న స్వతంత్ర విభాగమని అన్నారు. క్విడ్‌ ప్రో కో ఎలా జరిగిందో సజ్జల వివరించారు.

ఇవి కూడా చదవండి

అక్రమ కట్టడమని తెలిసిన ఇంట్లో చంద్రబాబు ఎందుకు నివాసముంటున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఇలాంటి స్కాములు మరిన్ని ఉన్నాయని, అవన్నీ త్వరలోనే బయకు వస్తాయని అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం…