Balineni Srinivasa Reddy: అక్కడి నుంచే పోటీ చేస్తా.. స్వయంగా ప్రకటించుకున్న మాజీ మంత్రి బాలినేని..
ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంటి పోరు మరింత ముదురుతోంది.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికే పార్టీలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంటి పోరు మరింత ముదురుతోంది.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికే పార్టీలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు నుండే పోటీ చేస్తానంటూ సోమవారం ప్రకటించారు. తాను సీఎం జగన్ మోహన్ రెడ్డిన తప్ప ఇంక ఎవ్వరినీ లెక్కచేయనంటూ ఫైర్ అయ్యారు. ఒంగోలు నియోజకవర్గం వదిలి.. గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలలో ఏదో ఒకచోట నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలినేని.. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నానన్నారు. ఎన్నికలు అంటే తాను ఎప్పుడు సీరియస్ గానే ఉంటానని, నిరంతరం ప్రజల్లో ఉండి గెలుపునకు ప్రయత్నం చేస్తానన్నారు.. తన రాజకీయ జీవితం ప్రారంభించింది ఒంగోలులోనే అని.. ఇక్కడినుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టంచేశారు. 1999 నుండి ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడు కూడా రాజీ లేని రాజకీయాలు చేశానని తెలిపారు. అయిన వారే నన్ను రాజకీయంగా అణగ దొక్కెందుకు ప్రయత్నిస్తున్నారు.. వారి కంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే నాకు ముఖ్యమంటూ పేర్కొన్నారు. కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు.
సీఎం జగన్ కూడా పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా బాలినేని సూచించారు. కాగా.. తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలతో ప్రకాశం జిల్లా వైసీపీలోని విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
