Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై సంచలన కామెంట్స్ చేసిన అవినాష్..

నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు. తనను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారో..

Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై సంచలన కామెంట్స్ చేసిన అవినాష్..
Mp Avinash Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2023 | 10:22 PM

నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు. తనను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు అవినాశ్‌ రెడ్డి హాజరయ్యారు.

వైఎస్‌ వివేకానందా రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. సీబీఐ అధికారులు అడిగి ప్రశ్నలకు తనకు తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు తనకు తెలిసిన సమాధానాన్ని ఇచ్చానని తెలిపారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాన్ని నిజంగా మార్చేందుకు, నిజాన్ని అబద్ధంగా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అవినాష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ విచారణ సాగుతోందని అవినాశ్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అవినాశ్‌ రెడ్డి సందేహాం వ్యక్తం చేశారు. టీడీపీ గతంలో ప్రస్తావించిన గూగుల్‌ టేకౌట్‌ను సీబీఐ అధికారులు విచారణలో వచ్చాయని వెల్లడించారు. తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరుగుతున్నట్టు కనిపించడం లేదని అన్నారు. వివేకానందా రెడ్డి చనిపోయిన రోజు మాట్లాడిన మాటలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉంటానని అవినాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరో వైపు వివేకానందా రెడ్డి ఇంట్లో దొరికిన లేఖను బయటపెట్టాలని సీబీఐ అధికారులను కోరినట్టు అవినాశ్‌ రెడ్డి తెలిపారు. అది ఎందుకు బయటపెట్టడం లేదో తెలియడం లేదని అన్నారు. కేసుకు సంబంధించి తనకున్న అనుమానాలను ప్రస్తావిస్తూ ఒక విజ్ఞాపన పత్రాన్ని సీబీఐ అధికారులకు అందజేసినట్టు అవినాశ్‌ రెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో