AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాజకీయాలు వెడ్స్ కులాలు.. ఏపీ పాలిటికల్ ఆటలో కులం కార్డు.. షో ఎలా ఉంటుందో మరి..!

ఏపీలో కౌన్‌బనేగా పెద్ద కాపు? కాపులకు ఛాంపియన్ ఎవరౌతారు? ఇదే ఇప్పడు వెయ్యి మిలియన్ డాలర్లంత బరువైన ప్రశ్న. జగన్‌, చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఈ సీక్వెన్స్‌లో చిన్న గ్యాప్‌ తీసుకుని బీజేపీ..

Andhra Pradesh: రాజకీయాలు వెడ్స్ కులాలు.. ఏపీ పాలిటికల్ ఆటలో కులం కార్డు.. షో ఎలా ఉంటుందో మరి..!
Andhra Pradesh
Shiva Prajapati
|

Updated on: Feb 24, 2023 | 10:18 PM

Share

ఏపీలో కౌన్‌బనేగా పెద్ద కాపు? కాపులకు ఛాంపియన్ ఎవరౌతారు? ఇదే ఇప్పడు వెయ్యి మిలియన్ డాలర్లంత బరువైన ప్రశ్న. జగన్‌, చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఈ సీక్వెన్స్‌లో చిన్న గ్యాప్‌ తీసుకుని బీజేపీ.. దాని వెనకే బీఆర్ఎస్ కూడా! కొడితే కాపు స్థలాన్నే కొట్టాలన్నంత కసి మీదున్నారు అందరూను. ఈ రేసుగుర్రాల్లో గెలుపు గుర్రం ఏదవుతుంది.. కాపుల మనసుల్ని కొల్లగొట్టే కింగాఫ్‌ ది కాపూస్.. ఎవరవుతారు?

కన్నా చేరికతో కాపులంతా టీడీపీలోకి వచ్చేస్తారా.. వచ్చేస్తారో లేదో గాని.. కన్నా ఒక్కడు చాలు.. అనే కాన్సెప్టుని సీరియస్‌గా వర్కవుట్ చేస్తోందట తెలుగుదేశం పార్టీ. గుంటూరు జిల్లా పాలిటిక్స్‌లో గట్టి పిండం కన్నా. కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోడానికి కన్నా ఒక ట్రంప్‌ కార్డ్ అనుకుంటోందట టీడీపీ. అలాగని కన్నాతోనే ఆగిపోరట చంద్రబాబు. కాపు ఓట్లు గంపగుత్తగా తమకే పడేలా చెయ్యడం కోసం స్కెచ్చులు గీస్తున్నారట. కౌంటర్ స్కెచ్చులతో వైసీపీ కూడా సిద్ధమిక్కడ.

కాపులకు వన్‌ అండ్ ఓన్లీ చాంపియన్‌ జగనే.. ఎనీ డౌట్స్.. అంటోంది వైసీపీ. అధికారంలో వాటా ఇచ్చేశాం.. క్యాబినెట్‌లో ఏకంగా ఐదు కుర్చీలిచ్చాం.. నామినేటెడ్ పోస్టులిచ్చాం.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. అనేది రూలింగ్ పార్టీ ఇస్తున్న రిథమిక్ సౌండ్. కాపు మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా.. ఇప్పటికే తమ సామాజికవర్గానికి వలెయ్యడంలో చాలా బిజీ.

ఇవి కూడా చదవండి

కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద యుద్ధమే చేసి బాగా అలసిపోయి.. ఓ పక్కనుండిపోయిన కాపు దిగ్గజం ముద్రగడ పద్మనాభం. ఆయనైతే ఆల్రెడీ వైసీపీ వైపే బెండై ఉన్నారు. చంద్రబాబు తన ఉద్యమాన్ని తొక్కిపడేశారన్న అనుమానం ఆయన్ను ఆటోమేటిగ్గా జగన్‌కి దగ్గర చేసింది. ముద్రగడను ఇంకాస్త గట్టిగా ప్రసన్నం చేసుకుని పొలిటికల్ ఎడ్వాంటేజ్ పొందాలని సీరియస్‌గా ట్రై చేస్తోంది జగన్ శిబిరం. కాపు ఓటు బ్యాంకు చీలకుండా చాలాచాలా కేర్‌ఫుల్‌గా ముందుకెళ్తోంది వైసీపీ.

ఇక జనసేన-బీజేపీ కలిసి పని చేస్తాయా లేదా అనే డౌట్లు అటుంచితే.. కాపు ఓట్ల విషయంలో ఎవరి దారి వాళ్లదే. కులం పేరు వాడను.. ఆ మాటకొస్తే నాదసలు కాపు కులమే కాదు.. అంటూ కులరహిత రాజకీయాల్ని ట్రై చేస్తానన్న పవన్‌కల్యాణ్.. ఆ తర్వాత కొద్దికొద్దిగా కాపు కార్డు ప్లే చేయడం మొదలుపెట్టారు. మొన్నామధ్య గతించిపోయిన ప్రజారాజ్యాన్ని గుర్తు చేస్తూ కాపు ఓటుబ్యాంకుల్ని టచ్ చెయ్యబోయింది జనసేన. కాపులంతా మెగా ఫ్యామిలీ వైపే అనే ఫీలర్లూ ఇచ్చేశారు. కాపు కోటా కోసం దీక్ష చేసిన సీనియర్ నేత హరిరామజోగయ్య కూడా జనసేనకు ఎక్స్‌ట్రా ఎసెట్.

ఏపీలో ఎదగడానికి తొందరపడుతున్న బీజేపీ కూడా కాపు కులం చుట్టూ రాజకీయాలు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు సొంత సామాజికవర్గం కావడంతో కాపుల మీద కాన్ఫిడెన్సు పెంచుకుంది బీజేపీ. కాపు కాకపోయినా కాపుల కోసం కాపు కాస్తా అంటూ అగ్రెసివ్‌గా అడుగులేస్తున్నారు జీవీఎల్. కాపుల సంక్షేమం కోసం పార్లమెంటులో కూడా సౌండిచ్చారు. ఎన్టీయార్ జిల్లాకు రంగా పేరు ఎందుకు పెట్టకూడదు అంటూ పెద్దపెద్ద స్టేట్‌మెంట్లే ఇచ్చి కార్నరయ్యారు జీవీఎల్.

గోడవతలున్న పొరుగు పార్టీ బీఆర్ఎస్ కూడా ఏపీలో కాపు ఓటు బ్యాంకు మీద గట్టిగానే కర్చీఫేసింది. కాపు కులానికి చెందిన తోట చంద్రశేఖర్‌ని పిలిపించుకుని ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కుర్చీయే వేశారు కేసీఆర్. బ్రాండ్‌న్యూ పాలిటిక్స్ చేద్దాం రా అంటున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణకూ గాలమేస్తోంది గులాబీ దండు. విశాఖ నుంచి పోటీ చేయుడు పక్కా.. ఏ పార్టీ అనేది మాత్రం అడక్కండి అంటూ సస్పెన్స్‌లో పెట్టిన లక్ష్మీనారాయణ రేపటిరోజు కేసీఆర్‌తో కలిసి కారెక్కినా ఎక్కుతారేమో. ఇక.. టీడీపీకీ-వైసీపీకీ మధ్య చక్కర్లు కొడుతూ టైమ్‌పాస్ చేస్తున్న గంటా శ్రీనివాసరావుక్కూడా కన్ను గీటేశారు కేసీఆర్. లక్ష్మీనారాయణన్నూ, గంటా శ్రీనివాసరావునూ దువ్వే డ్యూటీని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకిచ్చేశారు.

ఏపీలో 15 శాతం ఓట్ షేరున్న కాపులే పొలిటికల్ పార్టీల ఫేట్‌ని డిసైడ్ చేసేది. కోస్తాంధ్రలో అయితే.. కాపు ఓట్లే రాజకీయ పార్టీల తలరాతలు మార్చేది. ఐదు శాతం మించని రెడ్లు, కమ్మల కంటే 15 శాతం ఉన్న కాపుల్ని నమ్ముకుంటే పవర్‌ ప్లే నడుస్తుందన్నది వీళ్లందరి నమ్మకం. అందుకే.. ఇలా కలిసి పాడుదాం.. కాపు పాట.. అంటూ కోరస్ అందుకున్నారు. కాపువయ్యా.. మహ కాపువయ్యా.. అంటూ కూనిరాగం తీస్తున్నారు. కొడితే.. కాపుస్థలాన్నే కొట్టాలి.. అనే కమిట్‌మెంట్‌తో ముందుకెళ్తున్నారు. ఇంతకీ కాపు ఓటరు మహాశయుడి ఒరిజినల్ మనోగతమేంటి? ఓట్లేసి ఏ పార్టీని కరుణిస్తాడు.. ఏ కూటమిని కటాక్షిస్తాడు?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..