AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: కాకా హోటల్‌లో సామాన్యుల్లా తింటున్న ప్రముఖులు.. ఫోటోలు నెట్టింట్లో వైరల్..

ఈ కాకా హోటల్లో అలాంటి ఇలాంటి వాళ్ళు కాదు వాళ్లు తలుచుకుంటే ప్రతిరోజు స్టార్ హోటల్లో సైతం భోజనం భోజనం చేసే ప్రముఖులు సైతం అక్కడ సాదాసీదాగా ఉన్న బెంచీలపై కూర్చుని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఇంతకీ ఆ హోటల్ పేరేంటి...? అక్కడ భోజనం చేసిన ప్రముఖులు ఎవరంటే..

West Godavari: కాకా హోటల్‌లో సామాన్యుల్లా తింటున్న ప్రముఖులు.. ఫోటోలు నెట్టింట్లో వైరల్..
Andhra Pradesh
B Ravi Kumar
| Edited By: Surya Kala|

Updated on: Jan 31, 2024 | 8:54 AM

Share

ఇతర ప్రాంతాలకు వెళ్లి నప్పుడు ముందుగానే అక్కడ ఏ హోటల్ లో టిఫిన్ బాగుంటుంది.. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా దొరికే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుని వాటిని టేస్ట్ చేస్తుంటారు చాలా మంది. వీధి పక్కన పెట్టే బడ్డీలపై అమ్మే ఆహారమైనా ప్రత్యేకమైనదైతే కోటీశ్వరులైనా కారు దిగి అక్కడ నిలబడి తింటారు. ఎందుకంటే అక్కడ ఉండే ఆహారపదార్ధాల రుచి అలా చేయిస్తుంది. అలాంటి రుచికరమైన వంటలకు ఒక్కొ ప్రదేశంలో ఒక్కో ఫేమస్ హోటళ్లు , రెస్టారెంట్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. వీటి పేర్లు ప్రస్తావిస్తే ఆ లిస్టు చేంతాడంత ఉంటుంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో ఫేమస్.. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో దొరికే బొంగు చికెన్ అంత ఫేమస్. ఆ ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు రుచి చూడకుండా వెనక్కి రారు. విజయవాడలో బాబాయ్ హోటల్ ఎంత ఫేమస్ సో అందరికి తెలిసిందే. అదే విధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కూడా రుచికరమైన ఫేమస్ వంటకాలకు ఒక హోటల్ పెట్టింది పేరు. అయితే  అది స్టార్ హోటల్ కాదు.. ఓ కాకా హోటల్.

ఈ కాకా హోటల్లో అలాంటి ఇలాంటి వాళ్ళు కాదు వాళ్లు తలుచుకుంటే ప్రతిరోజు స్టార్ హోటల్లో సైతం భోజనం భోజనం చేసే ప్రముఖులు సైతం అక్కడ సాదాసీదాగా ఉన్న బెంచీలపై కూర్చుని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఇంతకీ ఆ హోటల్ పేరేంటి…? అక్కడ భోజనం చేసిన ప్రముఖులు ఎవరనే వివరాలోకి వెళ్తే..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దెందులూరు జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరు సునీల్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం భోజన సమయం అవడంతో వారు ఏలూరులో ఎంతో ఫేమస్ అయిన అప్పలరాజు హోటల్ కి భోజనానికి వెళ్ళారు. ఏ మాత్రం హోదా, పరపతి చూపించకుండా సామాన్యుల వలే చెక్క బల్ల ముందు కూర్చుని భోజనానికి సిద్ధమయ్యారు. అంతేకాక అక్కడ లభించే ఫేమస్ ఐటమ్స్ ను, అక్కడున్న వారి అందరితో కలిసి కడుపారా తిన్నారు..

ఇవి కూడా చదవండి

వారు తలుచుకుంటే ఫైవ్ స్టార్ హోటళ్ళలో వారు కోరుకున్న ఆహారం తినే గలరు. మనీ కూడా ఎఫర్ట్ చేయగలరు. అవన్నీ పక్కన పెట్టి చాలా సాధారణ వ్యక్తుల మాదిరి వారు అక్కడ భోజనం చేసిన తీరును ఎంతో మందిని ఆకర్షించింది. భోజనం విషయంలో రాజు బీద అనే తారతమ్యం ఉండదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అప్పలరాజు హోటల్లో వారు భోజనం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఏలూరులో అప్పలరాజు హోటల్ ఒక పూట మాత్రమే ఉంటుంది. చికెన్ కూర, కౌజు పిట్ట ఫ్రై, ఎగ్ కర్రీ, ఫిష్, బిర్యానీ ఇలా నాన్ వెజ్ ఐటెం లన్నీ దొరుకుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ భోజనం చేయాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్, చికెన్ కర్రీ తో తింటూ తర్వాత రసం వేసుకుని రెండు ముద్దలు తింటే నా సామి రంగ … ఇంత మన జానెడు కడుపుకి ఏం కావాలి చెప్పండి.

అందుకే ఎంత పెద్ద రాజకీయనాయకులు అయినా సరే ఇలా ఒక్కసారి మంచి భోజనం దొరికే హోటల్ కి వెళ్లి అక్కడే సాదారణ విజిటర్స్ తో కలిసి తింటే ఆ జ్ఞాపకాలు వీరలెవల్లో ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..