CM Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు.. మరో అవకాశం కోసం ఈ నేతల పరుగులు

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 6 సీట్లలో మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారంతో ఆ రెండు జిల్లాల నేతల్లో టెన్షన్ మొదలైంది. దీంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.

CM Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు.. మరో అవకాశం కోసం ఈ నేతల పరుగులు
CM Jagan
Follow us
Srikar T

|

Updated on: Dec 18, 2023 | 9:55 PM

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 6 సీట్లలో మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారంతో ఆ రెండు జిల్లాల నేతల్లో టెన్షన్ మొదలైంది. దీంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. నియోజకవర్గాల వారీగా పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదేమో అనే అనుమానం ఉన్న నేతలంతా సీఎంను కలుస్తున్నారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సీఎం జగన్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు.

సర్వేలు, నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలను సైతం మార్పులు చేస్తోంది పార్టీ అధిష్టానం. ఇటీవలే 11 స్థానాలపై ప్రకటన చేసిన అధిష్టానం.. మరో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు జరుగుతోంది. దీంతో ఆ జిల్లాలకు చెందిన నేతలు సీఎం జగన్‌ను కలుస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర బాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, రామచంద్రపురం ఎమ్మేల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్ధాలి గిరితో పాటు పలువురు ఎమ్మేల్యేలు.. ఒక్కొక్కరుగా సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు వివరిస్తూ.. తమకే మరోసారి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

సామాజిక సమీకరణాలు, నియోజకవర్గ పరిధిలో పరిస్థితుల ఆధారంగానే మార్పులు చేర్పులు జరుగుతాయని ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటించారు. ఇప్పటికే మొదటి దశలో 11 చోట్ల మార్పులు చేయగా.. అందులో ముగ్గురు మంత్రులకు స్థానచలనం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరి సీటు ఉంటుందో.. ఎవరి సీటు ఊడుతుందో వాళ్లకే అర్థం కావడం లేదు. ఏ క్షణం ఏ ప్రకటన వస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా ఎమ్మేల్యేలు గడుపుతున్నారు. చివరి ప్రయత్నంగా సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోసం పరుగులు తీస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదు. కొత్త, పాత అనే బేధం లేదు. గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా దింపుతాం అనే సంకేతాలు పార్టీ నుంచి వచ్చాయి. పార్టీ గెలుపే లక్ష్యంగా టికెట్ల ఎంపిక చేస్తున్నారు. టికెట్ ఇవ్వలేని వారిని తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగిస్తోంది పార్టీ అధిష్టానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..