AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: పుట్టుకతోనే జెనెటిక్ ప్రాబ్లం.. 7 ఏళ్లకే మృతి చెందిన మగసింహం

3 సింహల్లో ఒకటైన  మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు. ఈ అనురాగ్ పుట్టినప్పటినుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు.  జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో జన్మించింది సింహం. ముఖ్యంగా అనురాగ్ కు పుట్టుకతోనే కుడి కన్ను పూర్తిగా కనిపించదని చెప్పారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు.

Tirupati: పుట్టుకతోనే జెనెటిక్ ప్రాబ్లం.. 7 ఏళ్లకే మృతి చెందిన మగసింహం
Lion In Sv Zoo Park
Raju M P R
| Edited By: |

Updated on: Dec 18, 2023 | 9:20 PM

Share

తిరుపతి ఎస్వీ జూలో 7ఏళ్ల అనురాగ్ అనే సింహం మృతి చెందింది. ఏడేళ్ల క్రితం తిరుపతి ఎస్వీ జూ పార్క్ లోనే పుట్టిన సింహం ఆదివారం మృతి చెందినట్లు జూ క్యురేటర్ సెల్వం ప్రకటన విడుదల చేశారు. ఏడేళ్ల  క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ  3 సింహల్లో ఒకటైన  మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు. ఈ అనురాగ్ పుట్టినప్పటినుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు.  జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో జన్మించింది సింహం. ముఖ్యంగా అనురాగ్ కు పుట్టుకతోనే కుడి కన్ను పూర్తిగా కనిపించదని చెప్పారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు.

ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది అనురాగ్ కు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడంతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్ వి వెటర్నరీ యూనివర్సిటీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అనురాగ్ ను ఖననం చేసినట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..