Pawan Kalyan vs YCP Leaders: ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌పై సజ్జల హాట్ కామెంట్స్..

Pawan Kalyan vs YCP Leaders: జనసేన చేపట్టనున్న శ్రమదానంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

Pawan Kalyan vs YCP Leaders: ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌పై సజ్జల హాట్ కామెంట్స్..
Sajjala
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 01, 2021 | 6:06 PM

Pawan Kalyan vs YCP Leaders: జనసేన చేపట్టనున్న శ్రమదానంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనపై, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ పోరాటాలు చేయడం మానుకుంటే మంచిదని హితవుచెప్పారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ షో కోసమే అని దుయ్యబట్టారు. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే నటించి వెళ్లడానికి ఇదేమీ సినిమా కాదని వ్యాఖ్యానినంచారు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.

పబ్లిసిటీ కోసం చిల్లర కార్యక్రమాలు చేయడం పవన్ కళ్యాణ్ మానుకోవాలన్నారు. పవన్ స్థాయికి తాము దిగజారాల్సిన అవసరం లేదన్నారు. జనసేన పార్టీ ఒక దిశ, ఒక స్ట్రాటజీ లేకుండా ప్రయాణం చేస్తోందని విమర్శలు గుప్పించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా వచ్చే నష్టం ఏమీ లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి అని, నాలుగు నెలలకు ఒకసారి వచ్చి కార్యక్రమాలు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌కు భయపడి రోడ్లు వేశామని అనుకోవడం వారి భ్రమ అని, ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు.

Also read:

CM KCR: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. పర్యావరణ పచ్చదనం కోసం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రతిపాదన

‎aha – OTT: ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి… ‘త్రీ రోజెస్’ ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల

Crime News: మ్యాట్రీమోనీ అడ్డగా వాడి ఆట.. బాధితుల ఫిర్యాదుతో పోలీసుల వేట.. చివరికి తిరుపతిలో..