AP Telangana Politics: ఆయన చంద్రబాబును ఫాలో అవుదామని అనుకున్నారు.. మంత్రి హరీష్ రావు కామెంట్స్‌పై పేర్ని నాని కౌంటర్..
Perni Nani: జేపీ నడ్డా కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. మనువు బీజేపీతో మనసు చంద్రబాబుతో ఉన్న నేతల మాటలు విని నడ్డా ఏవేవో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాండ్ స్కామ్‌పై నడ్డా ఆరోపణలను ఖండించారు పేర్ని నాని. వైసీపీ హయాంలో ఇసుకతో 4వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మరి టీడీపీ-బీజేపీ హయాంలో ఆ నాలుగువేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి..
ఆంధ్రప్రదేశ్, జూన్ 11: శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. మనువు బీజేపీతో మనసు చంద్రబాబుతో ఉన్న నేతల మాటలు విని నడ్డా ఏవేవో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాండ్ స్కామ్‌పై నడ్డా ఆరోపణలను ఖండించారు పేర్ని నాని. వైసీపీ హయాంలో ఇసుకతో 4వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మరి టీడీపీ-బీజేపీ హయాంలో ఆ నాలుగువేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డా చెప్పాలన్నారు నాని. బెల్ట్ స్కామ్‌లు చేసింది టీడీపీ – బీజేపీలు కాదా అని ప్రశ్నించారు పేర్ని నాని. ప్రభుత్వం నడిపిస్తున్న బెల్ట్ షాపులతో ఆదాయం పెరిగిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. నాలుగేళ్ల క్రితం అమరావతి ల్యాండ్ స్కామ్ అన్న వాళ్లు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు పేర్ని నాని.
రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని మీరు చెప్పారు. ఇసుక ప్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు అంటూ ఆరోపించారు. మీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయంటూ నాని ప్రశ్నించారు. ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలని అన్నారు. మా ప్రభుత్వ చర్యలతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయని గుర్తు చేశారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచాం.. గత టీడీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను ఇద్దరికే కట్టబెట్టిందని.. లిక్కర్ సిండికేట్‌ను దందాగా నడిపింది మీరు కాదా అని పేర్ని నాని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం పాలన గాలికొదిలేసిందన్న తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని విరుచుకుపడ్డారు. హరీష్ నైజం తెలిసే.. సీఎం కేసీఆర్ 2018లో పక్కనపెట్టారని.. హరీష్ రావుకు తన మామ కేసీఆర్ పై కోపం ఎక్కువన్నారు. కేసీఆర్‌ను ఎవరైనా తిడితే హరీష్ రావు అనందపడుతారని అన్నారు. దమ్మున్నవాళ్లతో కేసీఆర్‌ను తిట్టించాలని హరీష్ రావు భావిస్తున్నారనేలా ఆయన విమర్శలు ఉన్నాయని అన్నారు.
అంతేకాదు, 2018 ఎన్నికల్లో హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవ్వాలనుకున్నారన్నారని.. ఈ విషయం తెలిసి హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారని పేర్నినాని విమర్శించారు. ఈ సంగతి తెలంగాణలో అందరికీ తెలుసున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్‌తో కలవాలని హరీష్ రావు ప్లాన్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఈ విషయం తెలిసి హరీష్ రావును జైల్లో వేయిస్తానని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడని పేర్నినాని ఆరోపించారు. అల్లుడు గిల్లుడు కేసీఆర్ చూస్తూ ఉంటే తప్పకుండా ఆయన్ని కూడా తిడతాం అని అన్నారు.
ఇదిలావుంటే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ ప్రభుత్వంపై పలు కీలక ఆరోపణలు చేశారు. నడ్డా ఏమన్నారో ఓసారి చూద్దాం.. బీజేపీ మహాసంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్న ఆయన.. మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి.. స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధితో మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. వైసీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు జేపీ నడ్డా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం