Andhra Pradesh: మరి ఇంత దారుణమా.. భార్య, అత్తను హత్య చేసిన భర్త.. ఆ విషయంలోనే అసలు గొడవ
కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతికిరాతకంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కౌతాలం మండలం బాపురాం గ్రామంలో తలారి హనుమంతమ్మ(45), ఆమె కుమర్తె(25) మహాదేవి(25) నివాసం ఉంటున్నారు.
కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతికిరాతకంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కౌతాలం మండలం బాపురాం గ్రామంలో తలారి హనుమంతమ్మ(45), ఆమె కుమర్తె(25) మహాదేవి(25) నివాసం ఉంటున్నారు. మహాదేవి తమ గ్రామంలోనే వాలంటీర్‌గా పని చేస్తోంది. 5 సంవత్సరాల క్రితం ఈమెకు వీరలదన్నె గ్రామానికి చెందిన దస్తగిరి అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ పలు వ్యక్తగత కారణాల వల్ల గత ఏడాది వీళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత మహాదేవి కర్ణాటకలోని టెక్కలికోటకు చెందిన బోయ రమేష్ అనే మరో వక్తిని నెల క్రితమే వివాహం చేసుకుంది. ఆ తర్వాత రమేష్ టెక్కలికోటలోనే కాపురం ఉందామని భార్య మహాదేవికి చెప్పాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గత రెండు రోజుల నుంచి గొడవలు జరుదగుతూనే ఉన్నాయి.
ఇదే విషయంపై శనివారం అర్థరాత్రి మళ్లీ వీళ్లు గొడవపడ్డారు. దీంతో ఆవేశంలో ఉన్న రమష్, భార్య మహాదేవి, అత్త హనుమంతమ్మను కర్రతో దారుణంగా కొట్టాడు. వాళ్ల అరుపులు విని స్థానికులు హనుమంతమ్మ సోదరుడు అయ్యప్పకు సమాచారం ఇచ్చారు. అయ్యప్ప వారి ఇంటికి వచ్చికి చూడగా తన సోదరి హనుమంతమ్మ, మహాదేవి మృతిచెందారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయ్యప్ప ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..