Andhra Pradesh: ఎండలు తగ్గకపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారం రోజుల పాటు ఒంటిపూట బడులు..
AP Half Day Schools : ఏపీలో రేపటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు ఒంటిపూట బడులు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం తరగతులు పూర్తయిన తర్వాత భోజనం, మజ్జిగ అందించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 17 వరకూ..
అమరావతి, జూన్ 11: వేసవి ఎండలు తగ్గకపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రేపటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు ఒంటిపూట బడులు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం తరగతులు పూర్తయిన తర్వాత భోజనం, మజ్జిగ అందించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 17 వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7.30 నుంచి 11.30 వరకూ మాత్రమే స్కూల్స్ నిర్వహణ ఉండనుంది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్‌కు వర్తిస్తుందని తెలిపింది విద్యాశాఖ. ఏపీలో మూడు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.
ఈ యేడాది ఇంకా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించలేదు. వేసవి ముగిసిన వెంటనే పలకరించాల్సిన తొలకరి ఇంకా దోబూచులాడుతోంది. తొలకరి ఝల్లుల కోసం ఎదురుచూస్తున్నారు జనం. అయితే రుతుపవనాలు ఏపీకి చేరడానికి మరింత సమయం పడుతుందనీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఉండడంతో ఈ ఆలస్యం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆలస్యానికి తక్షణ కారణం మాత్రం బిపర్జోయ్ తుఫానేనని అంటోంది ఏపీ తుఫాను హెచ్చరికల కేంద్రం .
మరోవైపు ఇండియన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ తాజాగా చల్లటి కబురు అందించింది. మరో 48 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు ప్రకటించింది. తీరప్రాంతంలోని తేమను అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను తన వైపు లాక్కుంటుండడంతో రుతుపవనాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు వాతావరణ నిపుణులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం