AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: అప్పుడే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

'బాబు రావాలి.. జాబు కావాలి'.. ఇది టీడీపీ డైలాగ్. ''బాబు ఓడాలి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలి'' ఇది తారక్‌ ఫ్యాన్స్‌ డైలాగ్. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్స్‌ చేశారు. జగన్‌, జూనియర్‌ ఎన్టీఆర్ తనకు రెండు కళ్లన్నారు.

Kodali Nani: అప్పుడే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు.. కొడాలి నాని  సంచలన వ్యాఖ్యలు
Kodali Nani Jr Ntr
Balaraju Goud
|

Updated on: May 05, 2024 | 8:37 AM

Share

‘బాబు రావాలి.. జాబు కావాలి’.. ఇది టీడీపీ డైలాగ్. ”బాబు ఓడాలి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలి” ఇది తారక్‌ ఫ్యాన్స్‌ డైలాగ్. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్స్‌ చేశారు. జగన్‌, జూనియర్‌ ఎన్టీఆర్ తనకు రెండు కళ్లన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లపై తనకు.. సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు కొడాలి నాని.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నానికి మద్దతు తెలియజేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులనుద్దేశించి ప్రసంగించి కొడాలి నాని సంచలన కామెంట్‌ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మకద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ వారసులు, అభిమానులెవరు టీడీపీలో ఉండరని, చంద్రబాబు వెంట నడవరన్నారు.

పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే… ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశామని గుర్తు చేశారు. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని, లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదన్నారు. అభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కి, లోకేష్ ను అందలం ఎక్కిస్తారన్నారు కొడాలి నాని. జూనియర్‌ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు పట్టుకున్నప్పుడే, అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్ చేతికి వస్తాయన్నారు కొడాలి నాని. ఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారో, పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారన్నారు కొడాలి నాని.

పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారన్నారు కొడాలి నాని. తాను పెద్ద ఎన్టీఆర్ భక్తుడినని, నందమూరి హరికృష్ణ తన గురువు అన్నారు కొడాలి నాని. తాను వైసీపీలో ఉన్నా తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతానన్నారు కొడాలి నాని. తాను తిరిగే కారుకు ఎన్టీఆర్…. వైయస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని ధైర్యంగా తిరుగుతానన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఉన్న బాంధవ్యం విడదీయరానిదన్నారు కొడాలి నాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…