TDP: బుచ్చయ్య చౌదరిపై గ్రామం అంతా రివర్స్.. ఏం జరిగిందంటే…?

ఎన్నికలకు ఇంకొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. ఇలాంటి కీలక సమయంలో కొందరు టీడీపీ అభ్యర్థులకు అనుకోని షాక్‌లు తగులుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు, మరికొన్ని చోట్ల వ్యతిరేక వర్గాల, ఇంకొన్ని చోట్ల రెబల్స్.. సైకిల్ పార్టీని టెన్షన్ పెడుతున్నారు. ఆ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం..

TDP: బుచ్చయ్య చౌదరిపై గ్రామం అంతా రివర్స్.. ఏం జరిగిందంటే...?
Gorantla Butchaiah Chowdary
Follow us

|

Updated on: May 04, 2024 | 8:38 PM

ఎన్నికల ప్రచారంలో పలువురు టీడీపీ నేతలకు క్షేత్రస్థాయిలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు, మరికొన్ని చోట్ల సొంత పార్టీ నేతలు టీడీపీ అభ్యర్థులకు షాక్ ఇస్తున్నారు. రాజమండ్రి రూరర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి.. మహిళను దుర్భాషలాడటంతో వివాదం చెలరేగింది. గ్రామంలోని వారంతా ఆయనపై రివర్స్ అయ్యారు. నన్ను చెప్పుతో కొడతావా అంటూ బుచ్చయ్య చౌదరిపై మహిళ మండిపడింది. దీంతో అక్కడున్న కార్యకర్తలు బుచ్చయ్య చౌదరిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో చోట బుచ్చయ్య చౌదరిని ఏం చేశావంటూ నిలదీశారు స్థానికులు.

ఇక అనంతపురం అర్బన్‌ టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు తమ కార్యకర్తపై దాడి చేశారని దగ్గుపాటి ప్రసాద్ వర్గీయుల ఆరోపించారు. దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది.

మరోవైపు ఉండిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీకి కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు. ఆ పార్టీ విమర్శలకు మాజీ ఎమ్మెల్యే శివ దీటుగా స్పందిస్తున్నారు. ఉండి ప్రజలతో ఉన్న అనుబంధంతోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచానంటున్నారు. మొత్తానికి ఎన్నికల ప్రచారంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్న టీడీపీకి అనేక చోట్ల అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..