AP News: రైలులో ఆవుమాంసం.. పీఠాధిపతి ఎంట్రీతో హీటెక్కిన సీన్

రైళ్లో ఆవుమాంసం తరలిస్తున్నారంటూ హిందూ సంఘాలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నాయి. రైల్ రోకో నిర్వహించారు. తాళ్లాయపాలెం పీఠాధిపతి సైతం ఆందోళనకారులతో కలసి నిరసన తెలిపారు. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

AP News: రైలులో ఆవుమాంసం.. పీఠాధిపతి ఎంట్రీతో హీటెక్కిన సీన్
Guntur Railway Station
Follow us

|

Updated on: May 04, 2024 | 8:24 PM

మే 4, శనివారం.. గుంటూరు రైల్వే స్టేషన్‌లో తీవ్ర హైటెన్షన్ నెలకుంది. రైలులో ఆవుమాంసం తలరిస్తున్నారంటూ ఆరోపిస్తూ.. హిందూ, ధార్మిక సంఘాల వారు.. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించి.. పూజించే ఆవును వధించి.. మాంసం తరలిస్తున్నారంటూ.. రైల్వేస్టేషన్‌లో హిందూసంఘాలు ఆందోళనకు దిగాయి. మాంసాన్ని తరలిస్తున్నవారిని అరెస్ట్ చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని వారంతా గొడవకు దిగారు. గోమాంసం తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ట్రైన్ రాకపోకలకు  అంతరాయం కలిగింది. ఇదే సమయంలో తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కూడా రైల్వే స్టేషన్‌కు రావడంతో.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆందోళనకారులతో కలిసి ఆయన కూడా రైల్ రోకోలో పాల్గొన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి.. మాంసం తరలింపుపై దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.

పోలీసుల జోక్యంతో.. హిందూసంఘాలు శాంతించాయి. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే రైలు రోకో కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని పాసింజర్స్ ఇక్కట్లు పడ్డారు. ట్రైన్ ప్రయాణానికి ఆటంకం కలగడంతో కాసేపు ఇబ్బందులకు లోనయ్యారు. అయితే పోలీసుల జోక్యంతో రైలు తిరిగి స్టార్టవ్వడంతో..  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? ఆ అంశమే కీలకం..!
కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? ఆ అంశమే కీలకం..!
సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు..
సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు..
ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. సీన్ కట్ చేస్తే.!
ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. సీన్ కట్ చేస్తే.!
చెన్నై, బెంగళూరు జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు?
చెన్నై, బెంగళూరు జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు?
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌‎లేటర్ తొక్కిన డాక్టర్.. కట్ చేస్తే..
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌‎లేటర్ తొక్కిన డాక్టర్.. కట్ చేస్తే..