కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు.. ఆమె కాదనేసరికి దారుణానికి ఒడిగట్టాడు.. చివరికి

సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా నిందితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలో మహిళలపై దాడులు ఇటీవలి కాలంలో...

కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు.. ఆమె కాదనేసరికి దారుణానికి ఒడిగట్టాడు.. చివరికి
Woman Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 08, 2022 | 9:50 AM

సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా నిందితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలో మహిళలపై దాడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడం(Harassment), కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడం వంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి దాడి చేస్తున్నారు. కొన్ని కొన్ని సంఘటనల్లో హత్యలకూ(Murder) వెనుకాడటం లేదు. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న యువకుడు లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో కత్తెరతో పొడిచాడు. గొంతు, వీపుపై విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె కేకలు వేస్తుండగా.. నోరు మూసేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అదే ఇంట్లోని బాత్రూమ్ లో స్నానం చేసి, బట్టలు మార్చుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.

శ్రీకాకుళం జిల్లా పొందురు మండలంలోని గోకర్లపల్లి గ్రామానికి చెందిన మహేష్‌కు ఓ మహిళతో పరిచయం ఉంది. ఈ నెల 4న మహిళతో ఫోన్ లో మాట్లాడిన మహేశ్.. ఆమె ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడుతూ లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో ప్రాధేయప్డాడు. అయినా ఆమె ససేమిరా అనడంతో తీవ్ర కోపంతో విచక్షణ కోల్పోయాడు. పక్కనే ఉన్న కుట్టుమిషన్‌ కత్తెరతో మెడపై పొడిచాడు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయం కాగా ఆమె అరిచింది. ఊహించని ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన మహేశ్.. ఆ మహిళ బతికి ఉంటే ప్రమాదమని భావించాడు. అదే కత్తెరతో వీపు, మెడపై విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు.

నిందితుడి ఒంటిపై రక్తం మరకలు ఉండటంతో బాత్‌రూంలో స్నానం చేసి, దుస్తులు వేసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రయినా ఆమె తలుపు తీయకపోవడంతో స్థానికులు మహిళ ఇంటికి వెళ్లారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యారు. మృతురాలి తల్లి గురుగుబెల్లి అమ్మడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ రికార్డింగ్‌, క్లూస్‌టీం, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

Also Read

Royal Challengers Bangalore New Captain: సారథిగా ఆ ప్లేయర్‌నే ఫైనల్ చేసిన ఆర్‌సీబీ.. త్వరలో ప్రకటన..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. 11 ఏళ్ల బాలుడు 1000 కి.మీలు ఒంటరిగా ప్రయాణించాడు..!

Kamareddy: పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. తల్లడిల్లుతోన్న తల్లిదండ్రులు..