Kamareddy: పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. తల్లడిల్లుతోన్న తల్లిదండ్రులు..

'చదువే జీవితం కాదు.. పరీక్షలే ఫైనల్‌ కాదు' అని చెబుతున్నా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చిన్నచిన్న కారణాలకు క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాలను బలి తీసుకుంటున్నారు

Kamareddy: పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. తల్లడిల్లుతోన్న తల్లిదండ్రులు..
Follow us
Basha Shek

|

Updated on: Mar 08, 2022 | 8:14 AM

‘చదువే జీవితం కాదు.. పరీక్షలే ఫైనల్‌ కాదు’ అని చెబుతున్నా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చిన్నచిన్న కారణాలకు క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని కుంగుబాటుకు గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్ జిల్లా ధర్మారం లోని తిరుమల నర్సింగ్ హోమ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యానని తెలుసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన శిరీష సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరి వేసుకుంది.

కాసేపటికి ఇది గమనించిన శిరీష సోదరులు చున్నీ విప్పీ ఆమెను కిందకు దించగా.. అప్పటికే ఆమె మరణించింది. ఇదే సమయంలో పొలంపనుల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని తల్లడిల్లిపోయారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృతదేహాన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. Also Read:మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో

NEET UG 2021 Counselling: ఆ సర్టిఫికేట్‌ లేనికారణంగా అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేయొద్దు! అవసరమే కానీ తప్పనిసరేంకాదు..

Aishwaryaa Rajinikanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రజనీకాంత్‌.. కారణమేంటంటే..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!