AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwaryaa Rajinikanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రజనీకాంత్‌.. కారణమేంటంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwaryaa Rajinikanth) గత నెలలో కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్న ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది.

Aishwaryaa Rajinikanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రజనీకాంత్‌.. కారణమేంటంటే..
Aishwaryaa Rajinikanth
Basha Shek
|

Updated on: Mar 08, 2022 | 7:41 AM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwaryaa Rajinikanth) గత నెలలో కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్న ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. తాజాగా మరోసారి ఆస్పత్రి పాలైంది ఐశ్వర్య. పోస్ట్‌ కొవిడ్‌ (Post Covid) సమస్యలే దీనికి కారణం. తాను తీవ్ర జ్వరం, వర్టిగోతో బాధపడుతున్నట్లు, ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిందీ డైరెక్టర్‌. ‘జీవితం కరోనాకు ముందు కరోనా తర్వాత.. జ్వరం, వర్టిగో కారణంగా మళ్లీ హాస్పిటల్‌లో చేరాను. అయితే ఆస్పత్రిలో మనం కలవబోయేది ఒక అందమైన, స్పూర్ఫిదాయకమైన డాక్టర్ అయినప్పుడు ఇది అంత చెడ్డగా ఏమీ అనిపించదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు డాక్టర్ ప్రీతికా చారిని కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది ఐశ్వర్య. ఈ ఫొటోలో ఆమె పక్కనే చికిత్స అందజేస్తున్న డాక్టర్‌ కూడా ఉన్నారు. ఈక్రమంలో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఐశ్వర్య- ధనుష్ దంపతులు తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ ఇద్దరు హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు. ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకైతే ఆ సూచనలు కనిపించడం లేదు. ఇటీవల కామన్‌ ఫ్రెండ్‌ ఇచ్చిన పార్టీలో ఒకరికొకరు ఎదురైనా కనీసం పలకరించుకోలేదని తమిళ మీడియా పేర్కొంది. ఇక విడాకుల తర్వాత అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో తలమునకలైపోయారు.

Also Read:Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

UPSC Mains 2021: కోవిడ్‌ వల్లనే పరీక్ష రాయలేకపోయం.. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షకు అదనపు అటెంప్ట్‌ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌!

Horoscope Today: ఈరాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..