AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Challengers Bangalore New Captain: సారథిగా ఆ ప్లేయర్‌నే ఫైనల్ చేసిన ఆర్‌సీబీ.. త్వరలో ప్రకటన..

గతేడాది టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత, ఐపీఎల్ ఫేజ్ టూ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Royal Challengers Bangalore New Captain: సారథిగా ఆ ప్లేయర్‌నే ఫైనల్ చేసిన ఆర్‌సీబీ.. త్వరలో ప్రకటన..
Ipl 2022, Royal Challengers Bangalore
Venkata Chari
|

Updated on: Mar 08, 2022 | 9:40 AM

Share

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్టులు ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసింది. RCB వర్గాల సమాచారం ప్రకారం డు ప్లెసిస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు పలు మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. డు ప్లెసిస్‌ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ్లెన్ మాక్స్‌వెల్ పేరు కూడా అతనితో చర్చల్లోకి వచ్చింది. అయితే చివరికి డు ప్లెసిస్ పేరును ఫైనల్ చేశారని సమాచారం. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అతని పేరును అంగీకరించాడని, త్వరలో RCB డు ప్లెసిస్ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఫాఫ్ డు ప్లెసిస్ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. ఆఫ్రికా తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, 23 మ్యాచ్‌లు గెలిచాడు. కేవలం 13 మ్యాచుల్లోనే ఓడిపోయాడు. అలాగే 1 మ్యాచ్ టై చేసుకున్నాడు. ఫాఫ్ గెలుపు శాతం 63.51గా నిలిచింది. మరోవైపు గ్లెన్ మాక్స్‌వెల్ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో ఆడలేడు. దీంతో అతను డు ప్లెసిస్‌ కంటే వెనుకంలో నిలిచాడు.

విరాట్ కెప్టెన్సీపై సముఖంగా లేడు.. గతేడాది టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత, ఐపీఎల్ ఫేజ్ టూ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకోవాలనుకున్నట్లు పేర్కొన్నాడు. 2013 సీజన్‌లో కోహ్లి RCBకి కెప్టెన్ అయ్యాడు. కానీ, అతని కెప్టెన్సీలో ఒక్కసారి కూడా IPL టైటిల్ గెలవలేకపోయాడు. 2016లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయింది.

గతేడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన డు ప్లెసిస్‌ 16 మ్యాచ్‌ల్లో 45.21 సగటుతో 633 పరుగులు చేశాడు. అదే సమయంలో ఇప్పటివరకు ఆడిన 100 మ్యాచ్‌ల్లో 34.94 సగటుతో 2935 పరుగులు చేశాడు.

Also Read: IPL 2022: ధోని టీంలో చేరిన కొత్త ప్లేయర్.. సూరత్‌లో మొదలైన సీఎస్‌కే సందడి..

Sunil Gavaskar-Shane Warne: షేన్ వార్న్‌ గురించి అలా అనాల్సింది కాదు.. అసలు అలా ప్రశ్నించడమే తప్పు: సునీల్ గవాస్కర్