AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పెళ్లికి ముందు పరారైన ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందంటే..

Crime News: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం చౌకిళ్లవారిపల్లిలో పెళ్లికి ముందు డబ్బు, బంగారంతో పెళ్లికొడుకు పరారయ్యాడు. పెద్దలను ఒప్పించి పెళ్లిదాకా వచ్చింది ఈ ప్రేమ వ్యవహారం.

Crime News: పెళ్లికి ముందు పరారైన ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందంటే..
Crime News
Ayyappa Mamidi
|

Updated on: Mar 08, 2022 | 8:25 AM

Share

Crime News: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం చౌకిళ్లవారిపల్లిలో ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు నిరసనకు దిగింది. రేణిగుంటకు చెందిన చందన అనే యువతి, నిమ్మనపల్లె మండలానికి చెందిన కేధార్ నాథ్ మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం(Love Matter) నడుస్తోంది. వీరిద్దరికీ చెన్నై నగరంలోని తాంబరంలో పరిచయం ఏర్పడింది. వీళ్ల ప్రేమ కథ రెండు సంవత్సరాలుగా సాఫీగానే సాగుతోంది. ఆ తరువాత వారు విషయాన్ని ఇంట్లోని పెద్దలకు సైతం తెలిపారు. పెద్దల అంగీకారంతో పోయిన నెల 21న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

అదేంటంటే పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లికొడుకు పత్తాలేకుండా(Missing) పోయాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. వివాహానికి ముందే బంగారం, డబ్బు తీసుకెళ్లిన కేధార్ నాథ్ తన సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ ఘటనతో అమ్మాయి ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో ప్రియుడు మోసం చేసినట్లు ఆ యువతి తాంబరం పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. నిన్న సదరు యువతి తల్లిదండ్రులతో కలిసి అతని ఇంటి వద్ద నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరింది. పెళ్లి పేరుతో మోసం చేసి ఉడాయించిన ప్రియుడిపై స్థానిక నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ లోనూ చందన కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ప్రియుడి కుటుంబం మెుత్తం ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి..

Aishwaryaa Rajinikanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రజనీకాంత్‌.. కారణమేంటంటే..

Indians stocking: భయంతో వాటిని ఎక్కువ కొంటున్న భారతీయులు.. నిపుణులు ఏమంటున్నారంటే..