AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆడుకుంటానంటే ఫోన్‌‌ ఇచ్చింది.. అంతే, దెబ్బకు బ్యాంకు ఖాతాలో 4 లక్షలు హాంఫట్..

మీకు ఉద్యోగం వచ్చిందనో, లాటరీ తగిలిందనో, లేకుంటే కారు బహుమతిగా వచ్చిందనో, వ్యాపారంలో పెట్టుబడికి లోను మంజూరైందనో నమ్మబలుకుతున్న సైబర్ నేరగాళ్ల వలలో చాలామంది పడుతున్నారు.. అంతటితో ఆగకుండా.. నేరస్థులు కొంత నగదు పంపాలని కోరుతున్నా.. ఆలోచించకుండా ఇస్తూ.. అడిగిందల్లా వివరాలు చెప్పేస్తున్నారు..

Andhra Pradesh: ఆడుకుంటానంటే ఫోన్‌‌ ఇచ్చింది.. అంతే, దెబ్బకు బ్యాంకు ఖాతాలో 4 లక్షలు హాంఫట్..
Phone Game
Fairoz Baig
| Edited By: |

Updated on: Dec 09, 2024 | 8:33 PM

Share

అయాచితంగా కష్టపడకుండానే లక్షలు సంపాదించాలన్న ఆత్రం సైబర్ నేరాలకు అవకాశాలను కల్పిస్తోంది.. ఈజీ మనీకోసం అరాటపడే ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.. చదువులేని నిరక్షరాస్యులు సైబర్‌ నేరగాళ్ళ బారిన పడ్డారంటే అర్దం ఉంది.. అయితే ఇటీవల కాలంలో చదువుకున్న టీచర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు కూడా సైబర్ నేరగాళ్ళ వలకు చిక్కి ఆర్ధికంగా నష్టపోతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.. మీకు ఉద్యోగం వచ్చిందనో, లాటరీ తగిలిందనో, లేకుంటే కారు బహుమతిగా వచ్చిందనో, వ్యాపారంలో పెట్టుబడికి లోను మంజూరైందనో నమ్మబలుకుతున్న సైబర్ నేరగాళ్ల వలలో చాలామంది పడుతున్నారు.. అంతటితో ఆగకుండా.. నేరస్థులు కొంత నగదు పంపాలని కోరుతున్నా.. ఆలోచించకుండా.. ముందూ వెనుక చూసుకోకుండా అత్యాశపరులు అడిగినంత డబ్బును ఇస్తూ.. అడిగిందల్లా వివరాలు చెప్పేస్తున్నారు.. అలాగే సెల్‌ఫోన్లను చిన్నపిల్లలకు ఆడుకునేందుకు ఇచ్చిన సమయంలో వచ్చిన సైబర్‌ నేరగాళ్ల లింకులను నొక్కడం వల్ల తమకు తెలియకుండానే తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. అలాంటి ఓ ఉదంతమే బాపట్లజిల్లా వేటపాలెంలో వెలుగు చూసింది.

సైబర్‌ నేరగాళ్లు రకరకాల ఆధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత అనే చిరు వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తన కూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున్న కూతురు తెలిసో, తెలియకో అందులోని సైబర్ నేరగాళ్ళు పంపిన ఓ లింక్ ను ఓకే చేసింది. అప్పటికే కాచుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్లు చిక్కిందే తడవుగా వాళ్ళపని వాళ్ళు చేసుకున్నారు.

అనితకు చెందిన వేటపాలెంలోని యూనియన్ బ్యాంకు ఖాతాలో ఉన్న నాలుగు లక్షల రూపాయల నగదును విడత వారీగా ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదును అపహరించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..