AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఇదెక్కడి మాస్ రా మావా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా.. చివరికి సీన్ ఇది

హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేశారంటూ ఓ కారు యజమానికి జరిమానా విధించారు పోలీసులు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన జాడ రోహిణి అనే మహిళకు ఎదురైన వింత అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

AP News: ఇదెక్కడి మాస్ రా మావా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా.. చివరికి సీన్ ఇది
Ap News
Gamidi Koteswara Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2024 | 12:59 PM

Share

హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేశారంటూ ఓ కారు యజమానికి జరిమానా విధించారు పోలీసులు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన జాడ రోహిణి అనే మహిళకు ఎదురైన వింత అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జాడ రోహిణి అనే మహిళకు AP39SR 8471 గల కారు ఉంది. అయితే ఈమె మొబైల్ ఫోన్‌కి సెప్టెంబర్ 2న విశాఖ పోలీసుల నుంచి హెల్మెట్ ధరించని కారణంగా 135/- ఫైన్ విధిస్తున్నట్లు మెసేజ్‌ వచ్చింది. పోలీసులు నుంచి వచ్చిన ఆ మెసేజ్ చూసి రోహిణి ఖంగుతింది. అసలు తన కారు బొబ్బిలిలోని తన ఇంటి వద్ద పార్కింగ్‌లోనే ఉంది, బయటకు కూడా తీయలేదు. కానీ విశాఖలో ఉన్నట్లు, అది కూడా హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేసినట్లు ఫైన్ ఎలా వేశారు? తనకు మెసేజ్ ఎలా వచ్చింది? అని ఒకింత ఆశ్చర్యానికి గురైంది. అయినా కారులో ప్రయాణిస్తే సీటు బెల్టు పెట్టుకోవాలి కానీ.. హెల్మెట్ పెట్టుకోవడం ఏంటి అని అయోమయానికి గురైంది.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

ఆ తరువాత పొరపాటున వచ్చి ఉంటుందని ఫైన్ కట్టకుండా వదిలేసింది రోహిణి. కొద్ది రోజులకు పెండింగ్ ఉన్న ఫైన్ చలానా రూ. 135 కట్టాలని మరో మెసేజ్ వచ్చింది. అలా గడిచిన మూడు నెలల్లో మూడు సార్లు ఫైన్ కట్టాలని మెసేజ్ వచ్చింది. దీంతో చేసేదిలేక ఆన్‌లైన్‌లో చలానాను డౌన్‌లోడ్ చేసి చూసింది రోహిణి. ఆ ఆన్‌లైన్‌లో AP39SR8417 నెంబర్ గల ఒక బైక్‌పై వెళ్తున్న యువకుడి ఫోటో కనిపించింది. ఆ బైక్‌పై చివరి రెండు అక్షరాలు తప్పుబడటంతో అది రోహిణి కారు నెంబర్‌కి ఫైన్ మెసేజ్ వచ్చింది. ఇదంతా గమనించిన రోహిణి పోలీసుల నిర్లక్ష్యం తనకు ఇబ్బందులు తెచ్చి పెట్టిందని వాపోయింది.

కనీసం ఫైన్ వేసేటప్పుడు అయినా ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తే సంబంధం లేనివారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఇప్పటికైనా తమ తప్పు సరిచేసి తన కారుకు ఉన్న ఫైన్ తొలగించాలని కోరుతుంది రోహిణి. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న పోలీసులు మాత్రం తమ నిర్లక్ష్య వైఖరి మార్చుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..