AP News: గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీ ప్రజలకు సంక్రాంతి నుంచి..

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ రెండోవ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల..

AP News: గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీ ప్రజలకు సంక్రాంతి నుంచి..
Ap News
Follow us
P Kranthi Prasanna

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2024 | 2:06 PM

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ రెండోవ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబోతోంది. ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలలో మార్పులు చేర్పులు చేసి.. ఇతర సర్వీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని భావిస్తోంది. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎన్నోసార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే పథకాలు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని గత ప్రభుత్వం పూర్తిగా రేషన్ కార్డులను కోత విధించింది.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 30,611 కాగా.. స్ప్లిటింగ్ కోసం వచ్చిన కార్డులు 46,918 వరకు ఉన్నాయి. కార్డులో సభ్యుల చేర్పుల కోసం మార్పుల కోసం 2,13,007.. తొలగింపు కోసం 36,588.. చిరునామాల మార్పు కోసం 8263, కార్డు సరెండర్ కోసం 685.. మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. వారితో పాటు రాష్ట్రంలో కార్డు కోసం ఎదురుచూస్తున్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిసెంబర్ నెల ఆఖరిలోపు దరఖాస్తును పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ఏపిలో నాలుగేళ్ల తరువాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల మంజూరు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?