- Telugu News Photo Gallery Cyclone Fengal landfall in hours, flights hit as rain pounds Chennai, Coastal Andhra Region
Cyclone Fengal: తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది.
Updated on: Nov 30, 2024 | 2:05 PM

నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా ఫెంగల్ కదులుతూ.. పుదుచ్చేరికి 120 కి.మీ..చెన్నైకి 110 కి.మీ, నాగపట్నానికి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఫెంగల్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో... తీరం దాటే సమయంలో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్ అలర్ట్: తిరుపతి, నెల్లూరు.. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్: చిత్తూరు, అనంతపురం.. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ : ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం.. ఆయా జిల్లాల్లో భారీ వర్ష సూచన.. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్: నెల్లూరు చిత్తూరు, కడప

తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. కృష్ణపట్నం ఓడరేవులో డేంజర్ సిగ్నల్ నెంబర్ 6.. మిగిలిన ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.





























