- Telugu News Photo Gallery Cinema photos Varun Tej is a key decision after continuous his movie failures
Varun Tej: వరుస ఫెయిల్యూర్స్‌తో వరుణ్ తేజ్ కీలక నిర్ణయం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టార్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరుణ్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 30, 2024 | 1:14 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టార్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరుణ్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు టైమ్ అస్సలు కలిసి రావటం లేదు. దాదాపు ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ యంగ్ హీరో. 2019లో రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్ వరుణ్ లాస్ట్ హిట్. ఆ తరువాత రకరకాల ప్రయోగాలు చేస్తున్నా... ఏ ఫార్ములా కూడా వరుణ్‌ను సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాలేకపోయింది.

గద్దలకొండ గణేష్ తరువాత ఐదు సినిమాలు చేశారు వరుణ్. కామెడీ, స్పోర్ట్స్ డ్రామా, స్పై యాక్షన్, ఏరియల్ యాక్షన్, పీరియాడిక్ ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. కానీ ఏ జానర్‌లోనూ హిట్ రాలేదు. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ మరింత కష్టాల్లో పడింది.

గని సినిమాతో మొదలైన బ్యాడ్ టైమ్ వరుణ్‌కి అలాగే కంటిన్యూ అవుతోంది. హిట్ ఫార్ములాతో వచ్చిన ఎఫ్ 3 కూడా నిరాశపరిచింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు మినిమమ్ బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.

రీసెంట్‌గా మాట్కా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు వరుణ్. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి ఆడియన్స్‌ను మెప్పించే కథతోనే థియేటర్లలోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.





























