అక్కమొగుడే కాలయముడై..

అక్కమొగుడే కాలయముడై..

అక్కమొగుడే కాలయముడయ్యాడు….బలవంతంగా పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించి చివరకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు…పెళ్లి చేసుకోకుంటే తల్లిదండ్రుల్ని, అక్కను చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానిక వేణుగోపాలస్వామి వీధిలో నివసిస్తూ…డిగ్రీ సెకండియర్‌ చదువుతున్న మౌనిక అనే యువతిని గత కొంతకాలంగా ఆమె బావ పాటిబండ్ల సుధాకర్‌ బాబు లైంగికంగా వేధిస్తున్నాడు. మౌనిక అక్క మాధవిని […]

Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Aug 29, 2019 | 4:01 PM

అక్కమొగుడే కాలయముడయ్యాడు….బలవంతంగా పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించి చివరకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు…పెళ్లి చేసుకోకుంటే తల్లిదండ్రుల్ని, అక్కను చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానిక వేణుగోపాలస్వామి వీధిలో నివసిస్తూ…డిగ్రీ సెకండియర్‌ చదువుతున్న మౌనిక అనే యువతిని గత కొంతకాలంగా ఆమె బావ పాటిబండ్ల సుధాకర్‌ బాబు లైంగికంగా వేధిస్తున్నాడు. మౌనిక అక్క మాధవిని ఐదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుధాకర్‌ అనంతరం ఆమె చెల్లెలు మౌనికపై కన్నేశాడు. మాధవికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లోనే ఇల్లరికం అల్లుడిగా తిష్టవేశాడు. ఈ క్రమంలో భార్య చెల్లెలు మౌనికను పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అయితే మౌనిక ఒప్పుకోవపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే ఆమె అక్కతో బాటు తల్లిదండ్రుల్ని చంపేస్తానని బెదిరించడంతో మౌనిక మౌనంగా ఉండిపోయింది.

అయితే ఇటీవల మౌనికకు పెళ్ళి సంబంధాలు చూస్తున్న నేపధ్యంలో సుధాకర్‌ తన భార్య, అత్తలతో గొడవపడుతున్నాడు. మౌనికతో తాను శారీరకంగా కలిసున్న సమయంలో వీడియోలు ఉన్నాయని, అవి బహిర్గతం చేస్తానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్ళి చేయాలని ఒత్తిడి చేశాడు. సుదాకర్‌ అసలు స్వరూపం బయటపడటంతో అతని భార్య మాధవి, అత్త చంద్రికలు ఈ రెండో పెళ్ళి వ్యవహారాన్ని ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరగడం, తనతో బావ సుధాకర్‌ కలిసున్న వీడియోలు ఉన్నాయని చెప్పడం వంటి సంఘటన నేపధ్యంలో మౌనిక తీవ్ర మనస్థాపానికి గురైంది. తాను లేకపోతే ఈ గొడవలు ఉండవు కదాఅని భావించి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బావ సుధాకర్‌ వేధింపులు భరించలేకే మౌనిక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని లేదంటే..ఉరివేసి చంపేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu