పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకూ విశాఖ నగర పరిధిలోని ఏ అసెంబ్లీ లోనూ విజయం సాధించలేదు. అలాగని ఏకంగా 2014లో విశాఖ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపిగా బరిలోకి దిగిన వైఎస్ విజయమ్మ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో పోయిన చోటే వెతికే పని ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ. ఎలాగైనా ఈసారి జెండా ఎగురవేయాలని కూడా నిర్ణయించింది.

పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?
Ysrcp
Follow us

| Edited By: Srikar T

Updated on: May 24, 2024 | 6:00 PM

వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకూ విశాఖ నగర పరిధిలోని ఏ అసెంబ్లీ లోనూ విజయం సాధించలేదు. అలాగని ఏకంగా 2014లో విశాఖ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపిగా బరిలోకి దిగిన వైఎస్ విజయమ్మ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో పోయిన చోటే వెతికే పని ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ. ఎలాగైనా ఈసారి జెండా ఎగురవేయాలని కూడా నిర్ణయించింది. 2009 పునర్విజన తర్వాత నాలుగు నియోజకవర్గాలుగా మారిన విశాఖ నగరం, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టింది. కనీసం ఒక్క స్థానాన్ని అయినా గెలిచేందుకు వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాలు 2014, 2019లో కూడా ఫలించలేదు. దీంతో 2024లో ఎలాగైనా ఆధిపత్యం కోసం ఆ పార్టీ బలమైన ప్రయోగాలే చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి విశాఖ నగరంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అధికార పార్టీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ సిటీ విశాఖ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విశాఖపట్నంకు ఢోకా ఉండదు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే చేసి, అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ రాజధాని అమరావతి అయినప్పటికీ.. విశాఖని ఆర్థిక రాజధానిగా, ముంబై లాంటి నగరంగా తీర్చిద్దుతామని అనేకసార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయంలో కీలక భాగస్వామిగా ఉన్న విశాఖ నగరంపై ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేశాయి.

రెండు ఎన్నికల్లోనూ ఎగరని వైసిపి జెండా..

గతంలో రెండు నియోజకవర్గాలకే పరిమితమైన విశాఖ నగరం 2009 పునర్విభజన తర్వాత నాలుగు నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ నగరంలో 2009లో విశాఖ నార్త్, వెస్ట్, సౌత్ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక్క ఈస్ట్ మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో 2014, 2019లో రెండుసార్లు నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో ఆధిపత్యం కోసం అప్పట్లో విఫల ప్రయత్నమే చేసింది. 2014లో ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, నార్త్ నుంచి అప్పటి కూటమి అభ్యర్థి అయిన విష్ణుకుమార్ రాజు, సౌత్ నుంచి ప్రస్తుతం వైసీపీలో ఉన్న అప్పటి టిడిపి నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్, వెస్ట్ నుంచి గణబాబులు విజయం సాధించారు. మళ్లీ 2019 లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు హ్యాట్రిక్ విజయం సాధించగా వెస్ట్ నుంచి గణబాబు, సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గెలుపొందారు. నార్త్ నుంచి కూడా గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వైసిపి సామాజిక సమీకరణాలతో అభ్యర్ధులను రంగంలోకి దింపినా విజయం సాధించలేకపోయింది.

విశాఖ టీడీపీకి కంచుకోటనా?

దీనికి కారణాలుగా అనేక అంశాలని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మొదటిది అర్బన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి పట్టు లేదనడం ఒకటి అయితే, విద్యావంతులు, ధనికులు ఎక్కువగా ఉన్నచోట వైఎస్ఆర్సిపి కంటే టిడిపికి ఆదరణ ఎక్కువ ఉంటుందన్న భావం కూడా ప్రచారంలో ఉంది. అదే సమయంలో విశాఖపట్నంపై తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకమైన అభిమానాన్నే చూపిస్తూ వచ్చేది. గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వరుసగా మూడుసార్లు పెట్టుబడుల సదస్సుని విశాఖలో నిర్వహించడంతోపాటు.. అంతకుముందు హుద్ హుద్ సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాఖలోనే బస చేసి నగర పునరాభివృద్ధి కోసం చేసిన కృషి కూడా నగరవాసుల్ని ఆకట్టుకుందని తెలుస్తోంది. అందుకే విశాఖ ప్రజలు రెండుసార్లు తెలుగుదేశంకే పట్టం కట్టారంటూ అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తూ వచ్చాయి. దానికి తోడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే విశాఖలో కూడా కీలకమైన రంగాలలో అగ్రస్థానంలో ఉండడంతో, ఆ పట్టు కొనసాగుతుందన్న అభిప్రాయము కలుగుతూ వచ్చింది.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‎పై రెపరెపలాడిన వైఎస్ఆర్సీపీ జెండా..

అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నగరంపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో పట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలను తొలగించే ప్రయత్నం.. ఒక సామాజిక వర్గ నేతలకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారంటూ పెద్ద చర్చే జరిగింది. ఈ పరిస్థితుల్లో అందరి అంచనాలకు భిన్నంగా 2021లో జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అద్భుతమైన వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయడంతో జీవీఎంసీని వైసిపి హస్తగతం చేసుకుంది. సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న టిడిపికి నగర పరిధిలో పరాజయం లభించేలా విజయసాయి రెడ్డి పార్టీని నడిపించారని చెబుతుంటారు. మొత్తం 98 మున్సిపల్ డివిజన్లో 60 వరకు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష టిడిపి జీవీఎంసీలో ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ విధంగా తొలుత పట్టు సాధించిన వైసిపి, ఆ తర్వాత ఇంచార్జ్‎గా వచ్చిన వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలంగా ముందుకు వెళ్ళింది. ఒకరకంగా చెప్పాలంటే అంతకు మించిన వ్యూహాలతో సామాజిక సమీకరణలను పూర్తిగా పక్కనపెట్టి అంగ, అర్థబలం కలిగిన నేతలని నియోజకవర్గానికి ఎంపిక చేసి వారిని కార్యక్షేత్రంలోకి దింపింది. నిరంతరం ప్రజల మధ్య ఉండేలా చూస్తూ నగర ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందే లాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వచ్చారు సుబ్బారెడ్డి. అదే సమయంలో నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించి అమలు చేస్తూ నగరాన్ని కొత్త రూపు దాల్చే విధంగా తీసుకెళ్లారు. దీంతో బలమైన వ్యూహాలతో ముందుకు వెళ్లగలిగే పరిస్థితి అధికార పార్టీకి దక్కింది.

ఈస్ట్‎లో వెలగపూడి జైత్ర యాత్రకు బ్రేక్ పడేనా?

దీంతో 2024 ఎన్నికలకు సామాజిక సమీకరణలను పక్కన పెట్టిన వైసిపి కేవలం గెలుపు గుర్రాల మాత్రమే ఎంచుకుంది. విశాఖలో నాలుగు నియోజకవర్గాల్లో అత్యంత బలమైన అభ్యర్థులని రంగంలోకి దింపింది. ఇక అంతకంటే అంగ, అర్థబలాల్లో బలమైన నేతలు విశాఖలో ఎవరూ లేరన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చింది. విశాఖ ఈస్ట్ నుంచి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబుని ఓడించేందుకు అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎంవివి సత్యనారాయణనే సరైన అభ్యర్థిని భావించింది. అంతకుముందు సామాజిక సమీకరణాల పేరుతో రెండు సార్లు వంశీని, బరిలోకి దింపింది. ఈసారి టికెట్ దక్కలేదని వాళ్ళిద్దరూ పార్టీలు మారినా లెక్క చేయలేదు వైసిపి. అంగ, అర్థబలాల్లో రామకృష్ణబాబుని దీటుగా ఎదుర్కోగల సత్తా ఎం వి వీ సత్యనారాయణకుందని ఎంవీవీనే పెడితే కచ్చితంగా గెలుస్తారన్న అభిప్రాయంతో అక్కడ బలమైన అభ్యర్థిగా దింపింది. ఎంవీవీ కూడా ఎంతో ఆసక్తిగా అక్కడ నుంచి గెలవాలన్న లక్ష్యంతో విపరీతమైన కృషి చేశారు. తనని ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి నిరంతరం నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉంటూ ప్రజల నమ్మకాన్ని కూడగట్టే ప్రయత్నాన్ని చేసుకున్నారు. పెద్ద బిల్డర్‎గా విశాఖ ఎంపీగా తనకున్న ఇమేజ్‎ని పక్కన పెట్టి నిరంతరం ఆ ప్రాంతంలోని పేద మురికివాడలో నిరంతరం తిరుగుతూ వాటిని అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ వాళ్ల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయం చేసుకుంటూ ఎన్నికల నాటి వరకు కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటూ అంతే గట్టిగా ఎలక్షనీరింగ్ కూడా చేశారు. రాష్ట్రంలో బహుశా అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ఓటుకు ఒక పార్టీ 5000 రూపాయలు ఇవ్వగా, ప్రత్యర్థి పార్టీ 3000 ఇచ్చింది. అంటే ఒక ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉంటే వాళ్లకి 50 వేల రూపాయలు దక్కింది. ఆ స్థాయిలో గెలుపు కోసం భూమిని ఆకాశాన్ని కదిలించినంత పని చేసింది వైసిపి. దీంతో ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబుకి, ఎంవివి సత్యనారాయణ బలమైన పోటీ ఇచ్చారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

నార్త్‎లో ఇద్దరు కింగ్‎ల మధ్య పోటీ..

ఇక నార్త్ నియోజకవర్గంలో కూడా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి మారిపోవడంతో అక్కడ కూటమి నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి అవకాశం లభించింది. అయితే గతంలో గంట శ్రీనివాస్‎పై కేవలం 2000 ఓట్లతో ఓడిపోయిన కేకే రాజు ఈ ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ముకుని, నియోజకవర్గంలోనే నిరంతరం పర్యటన చేస్తూ ఒకరకంగా అక్కడ ఎమ్మెల్యే గానే కొనసాగారు. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో పెద్దగా పర్యటన చేయకపోవడంతో అధికార పార్టీ నుంచి సమన్వయకర్తగా ఉన్న కేకే రాజు స్థానిక ఎమ్మెల్యే గానే అన్నట్టుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథకాలని అక్కడ లబ్ధిదారులకు అందిస్తూ నిరంతరం అక్కడ అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వామ్యమయ్యాడు. దీంతో కేకే రాజుకి ఈసారి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా వినిపిస్తోంది. అదే సమయంలో విష్ణువర్ధన్ రాజు 2014-19 లో నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నా తర్వాత కాలంలో నియోజవర్గ ప్రజలతో పెద్దగా టచ్‎లో లేరట. దానికి తోడు టీడీపీ కి ఆ నియోజకవర్గానికి గంటా వెళ్ళాక ఇంచార్జ్ కూడా లేకపోవడంతో చాలా మంది టీడీపీ నేతలు కేకే రాజుతో టచ్‎లో ఉన్నారట. వీటన్నింటికీ తోడు జే డీ లక్ష్మి నారాయణ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగానే ఉంది

వెస్ట్ బరిలో విశాఖ డైరీ..

అలాగే విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో కూడా పరిస్థితి వైసీపీకే అనుకూలంగా ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడి నుంచి రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందిన గణబాబుపై విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ పోటీ చేశారు. గణబాబు అక్కడ రెండుసార్లు గెలిచిన పెద్దగా అభివృద్ధి చేయలేదని తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఇతర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహిస్తానని చెప్పడంలో ఆనంద్ విజయం సాధించాడని దానికి తోడు ఆర్థికంగా బలమైన అభ్యర్థి అన్న భావన కలిగిన ఆనంద్ అంతే స్థాయిలో విజయం కోసం కృషి చేశారని, అందుకే అక్కడ ఫైట్ గట్టిగా జరిగిందన్న భావం అందరిలో వ్యక్తం అవుతుంది.

సౌత్ స్ట్రాటజీ ఇదీ..

ఇక సౌత్ నియోజకవర్గంలో గతంలో 2014, 2019 లో టిడిపి నుంచి గెలిచి 2021లో వైసిపి కొచ్చి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వాసుపల్లి గణేష్‎పై జనసేన నుంచి వంశీ పోటీ చేశారు. అయితే వంశీకి రాజకీయంగా అంత బలమైన వ్యూహాలు కానీ ప్రణాళిక కానీ లేకపోయినా అందర్నీ కలుపుకుపోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాసుపల్లి గణేష్‎పైన కూడా అక్కడ కొంత వ్యతిరేకత ఉందని ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుందన్న భావం అందరిలో నెలకొంది. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్