AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన వర్షాలు..!

ఈరోజు, మే 24వ తేదీన నైరుతి రుతుపవనాలు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలోని మిగిలిన భాగాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు వ్యాపించాయి.

AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన వర్షాలు..!
Andhra Rain Alert
Follow us

|

Updated on: May 24, 2024 | 4:36 PM

ఈరోజు, మే 24వ తేదీన నైరుతి రుతుపవనాలు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలోని మిగిలిన భాగాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు వ్యాపించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°/80°E,11°N/85°E, 13.5°N/90°E and 17°N/95°E గుండా కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడచిన 3 గంటల్లో ఈశాన్య దిశగా కదులుతూ, ఈ రోజు మే 24న 8.30 గంటలకు అదే ప్రాంతంలో 15.5° అక్షాంశానికి, 88.7°,రేఖాంశం వద్ద, ఖేపుపరా(బంగ్లాదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 730 కి.మీ క్యానింగ్(పశ్చిమ బెంగాల్)కు దక్షిణానికి 750 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్యం వైపు కదులుతూ మరింతగా బలపడి, మే 25 ఉదయం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా ఏర్పడుతుంది. తదనంతరం, అది దాదాపు ఉత్తర దిశగా, కదిలి 25వ తేదీ రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుంది. దాదాపుగా ఉత్తర దిశగా కదలడం కొనసాగిస్తూ మే 26 అర్ధరాత్రి, ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని ఉన్న సాగర్ ద్వీపం, ఖెపుపరా తీరాల దగ్గర తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు(గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు(గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు(గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు(గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు(గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.