Andhra Pradesh: మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం…భార్య మరణించిన కొద్దిసేపటికే భర్త మృతి..
భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం.. ఇది నిజం.. అందుకు సజీవ సాక్ష్యం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ వృద్ద దంపతుల జీవితం.. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లెసారది అనే గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 77 ఏళ్ల రెయ్యి ఉగాదమ్మ అనే వృద్దురాలు అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. భార్య మరణాన్ని జీర్నించుకోలేక 82 ఏళ్ల ఆమె భర్త రెయ్యి కామేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు
భార్య భర్తల బంధం అంటే రెండు దేహాలు ఒకే ప్రాణం అన్నారు ఓ కవి. భార్యాభర్తల బంధం అంటే పాలు, నీళ్ళులా కలిసిపోవలని పెద్దలు అంటారు. నిజమే మరి… వేరు వేరుగా ఉన్నంతవరకే ఇవి పాలు, ఇవి నీళ్ళు అంటూ చెప్పగలం. కానీ ఆ రెండు కలిసిపోతే మాత్రం పాల నుండి నీళ్లను గాని, నీళ్ళ నుండి పాలను గాని వేరు చేయటం ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి ఇద్దరి వ్యక్తుల మద్య ప్రేమానురాగాలతో కూడిన అసలుసిసలైన భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక ఆ దంపతులను వేరు చేయటం కూడా ఎవరికీ సాధ్యం కాదు. భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం.. ఇది నిజం.. అందుకు సజీవ సాక్ష్యం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ వృద్ద దంపతుల జీవితం.. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లెసారది అనే గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 77 ఏళ్ల రెయ్యి ఉగాదమ్మ అనే వృద్దురాలు అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. భార్య మరణాన్ని జీర్నించుకోలేక 82 ఏళ్ల ఆమె భర్త రెయ్యి కామేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉగాదమ్మ మృతి చెందిన కొన్ని నిమిషాల వ్యవధిలో తుది శ్వాస విడిచారు కామేశ్వరరావు. వీరి కుమారుడు బాలు అలియాస్ బాలకృష్ణ పాతికేళ్ళ క్రితం మావోయిస్టు ఉద్యమంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. వాస్తవానికి ఉగాదమ్మ, కామేశ్వర రావులు ఎంతో అన్యోన్యమైన జంట. వయసులో పెద్ద వారే అయినా అభ్యుదయ భావ జాలం ఉన్న వారు. దీంతో ఈ జంటను ఊరంతా గౌరవిస్తుంది. అయితే ఒకే రోజు భార్య మరణించిన కొద్దిసేపటికే భర్త మృతి చెందటంతో గ్రామములో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉగాదమ్మ, కామేశ్వరరావు దంపతుల మరణం అందరినీ కలచివేసింది. మరణములోను వీడని వీరి బంధం గురించి తెలుసిన వారంతా కొనియాడారు. శనివారం ఉదయం దంపతులకు గ్రామంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల అంతిమ యాత్రలో గ్రామస్థులంతా పాల్గొని ఘన నివాళులర్పించారు.
నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య పంతాలు, పట్టింపులు కారణంగా అనేక పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యను హతమార్చిన భర్త లేదా భర్తను హతమార్చిన భార్య వంటి ఘటనలను చూస్తున్నాము. ఇలాంటి తరుణంలో ఇలా చివరి వరకు అన్యోన్యంగా పాలు నీల్లులా కలిసిమెలసి ఉంటూ చివరకు చావులోను ఒకటిగా ఉన్న ఉగాదమ్మ, కామేశ్వరరావు దంపతులు నిజంగా ఆదర్శ ప్రాయులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజమైన భార్య భర్తల బంధంలో ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే… ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుందన్న పెద్దల మాటలను ఈ సందర్భంలో గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..