AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాలేజీ హాస్టల్‌ గదిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రసవం.. కాసేపటికే మృతి!

ఇంజినీరింగ్‌ విద్యార్థిని హాస్టల్‌లో ప్రసవించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఆడ శిశువును ప్రసవించిన అనంతరం తీవ్ర రక్తస్రావంతో విద్యార్ధిని మృతి చెందింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పాణ్యం ఇంచార్జి సీఐ శివకుమార్‌రెడ్డి పాణ్యం సర్కిల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు... నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థిని 3 నెలల కిందట చేరింది. విద్యార్థిని గర్భిణిగా..

Andhra Pradesh: కాలేజీ హాస్టల్‌ గదిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రసవం.. కాసేపటికే మృతి!
Engineering Student Gave Birth In Hostel
Srilakshmi C
|

Updated on: Jan 28, 2024 | 8:13 AM

Share

నంద్యాల, జనవరి 28: ఇంజినీరింగ్‌ విద్యార్థిని హాస్టల్‌లో ప్రసవించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఆడ శిశువును ప్రసవించిన అనంతరం తీవ్ర రక్తస్రావంతో విద్యార్ధిని మృతి చెందింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పాణ్యం ఇంచార్జి సీఐ శివకుమార్‌రెడ్డి పాణ్యం సర్కిల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు… నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థిని 3 నెలల కిందట చేరింది. విద్యార్థిని గర్భిణిగా ఉన్న విషయాన్ని కళాశాల యాజమాన్యం గుర్తించకపోవడం గమనార్హం. అసలు ఆమె ప్రసవించేవరకూ విషయం తోటి విద్యార్థినులకు కూడా తెలియలేదు. ఈ క్రమంలో కళాశాలలో సివిల్‌ ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శుక్రవారం అర్థరాత్రి కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఆ సమయంలోనే తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నారు. అయితే కడుపునొప్పి తీవ్రం కావడంతో రాత్రి 9 గంటలకు విద్యార్ధిని బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఎంత సేపటికి బయటకు రాకపోంవడంతో తోటి స్నేహితులు, అప్పటికే హాస్టల్‌కు చేరుకున్న తల్లిందడ్రులు తలుపును బద్దలుకొట్టారు.

లోపల కనిపించిన దృశ్యం చూసి అందరూ ఖంగు తిన్నారు. విద్యార్ధిని స్నానాల గదిలోనే ఆడ బిడ్డను ప్రసవించి, రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో పడిఉంది. విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది విద్యార్ధినిన హూటాహూటిన ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమించి విద్యార్థిని శనివారం మరణించింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చణీయాంశమైంది.

మరో ఘటన.. బస్సు నుంచి జారిపడి క్లీనర్‌ దుర్మరణం

‘సిద్ధం’ సభకు బస్సులో జనాలను భీమిలి తరలిస్తూ, ప్రమాదవశాత్తు అదే వాహనం కిందపడి క్లీనర్‌ మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ యాతపేటకు చెందిన ఉప్పాడ లక్ష్మణరావు (45) ఓ ప్రైవేటు బస్సులో గత ఐదేళ్లుగా క్లీనర్‌గా పని చేస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్‌ ధనుంజయరావు ఆయనకు స్వయానా సోదరుడు. ‘సిద్ధం’ సభకు ఎచ్చెర్ల నుంచి కోటబొమ్మాళి వెళ్లి 64 మందిని వదిలి, అక్కడి నుంచి భీమిలికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో డ్రైవర్‌ హఠాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో తలుపు వద్ద ఉన్న లక్ష్మణరావు జారి రోడ్డుపై పడ్డాడు. అదే బస్సు వెనుక చక్రాలు ఆయన పైనుంచి వెళ్లడంతో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.