Vijayawada: విజయవాడలో చీరల దొంగల హల్‌చల్.. చాకచక్యంగా ఆటకట్టించిన మంత్రి కుమార్తె!
చీరల దొంగల ముఠాలు ఇటీవల కాలంలో తమ చేతివాటన్నీ ప్రదర్శిస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడిన మహిళలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో దొంగతనాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. వేల, లక్షల ఖరీదైన చీరలను క్షణాల్లో మాయం చేస్తున్నారు. తాజాగా.. బెజవాడలో ఓ దొంగల ముఠా చీరల చోరీకి పాల్పడగా.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. విజయవాడ బందరు రోడ్డులోని గోలి హ్యాండ్లూమ్స్‌లో షాపింగ్ చేసేందుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు..

విజయవాడ, జనవరి 28: చీరల దొంగల ముఠాలు ఇటీవల కాలంలో తమ చేతివాటన్నీ ప్రదర్శిస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడిన మహిళలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో దొంగతనాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. వేల, లక్షల ఖరీదైన చీరలను క్షణాల్లో మాయం చేస్తున్నారు. తాజాగా.. బెజవాడలో ఓ దొంగల ముఠా చీరల చోరీకి పాల్పడగా.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. విజయవాడ బందరు రోడ్డులోని గోలి హ్యాండ్లూమ్స్‌లో షాపింగ్ చేసేందుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి వెళ్లారు.
ఆమె చీరలు చూస్తుండగా.. కొందరు మహిళలు కూడా షాపింగ్‌కు వచ్చారు. చాలా హడావుడి చేస్తూ ఖరీదైన చీరలు చూపించాలని సేల్స్‌మెన్స్ కోరుతూ తమ చేతివాటం ప్రదర్శించారు. షాప్ సిబ్బంది కళ్లుగప్పి ఖరీదైన చీరలు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఐదు చీరలను గుట్టు చప్పుడు కాకుండా దాచేశారు. అయితే షాప్ సిబ్బంది గమనించకపోయినా.. అక్కడే షాపింగ్ చేస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి మాత్రం చీరల దొంగతనాన్ని గమనించారు. వెంటనే ఆమె దొంగల ముఠాను అడ్డకునేందుకు సిద్దమయ్యారు. చీరలతో షాప్ బయటకు వచ్చేసిన మహిళలను అడ్డుకోగా.. అందరూ పరారయ్యారు.
కానీ ఓ మహిళను మాత్రం కృపాలక్ష్మి పట్టుకున్నారు. అప్పటికే చీరల దొంగతనాన్ని సీసీ కెమెరా ద్వారా గుర్తించిన షాప్ యజమాని సిబ్బందిని అలర్ట్ చేసారు. వారు బయటకు వెళ్ళిచూడగా.. డిప్యూటీ సీఎం కూతురు ఓ మహిళను అడ్డుకోవడం గమనించారు. ఆ మహిళా దొంగను షాప్‌లోకి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. ఐదుగురు మహిళలను అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




