Movie Tree: 150 ఏళ్ల సినిమా చెట్టు కూలిపోయింది.. దీని హిస్టరీ తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే

వందల ఏళ్లనాటి ఈ సినిమా చెట్టు కారణంగానే తమ ఊరికి పేరొచ్చింది గ్రామస్థులు చెబుతున్నారు. 150 ఏళ్ల జీవిత కాలంలో 300లకు పైగా సినిమాలలో కనిపించింది ఈ చెట్టు. గోదావరి నది గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథ ఏంటో తెలుసుకుందాం పదండి...

Movie Tree: 150 ఏళ్ల సినిమా చెట్టు కూలిపోయింది.. దీని హిస్టరీ తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే
Movie Tree
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2024 | 7:30 PM

ఆ చెట్టు కూలిపోయింది. దానికి దాదాపు 150 ఏళ్ల వయసు ఉంటుంది. చెట్టంటే ఏదో మామాలు చెట్టు కాదు. అదో సినీ మహా వృక్షం. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు…సినిమా పక్షులకు కూడా షూటింగ్‌ స్పాట్‌గా మారింది. ఆ చెట్టును కదిలిస్తే, చాలా సినిమా కథలు చెప్పేది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అల్లుకుపోయాయి. కానీ ఇప్పుడు అది కూలిపోయింది. దాంతో పాటే ఓ సినీ చరిత్ర కూడా కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్‌. అక్కడ సినిమా తీస్తే సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం. ఒకటా రెండా, వందల సినిమాల షూటింగులు, ఆ చెట్టు కిందే జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు.. సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది.

ఇది రియల్‌ వృక్షం మాత్రమే కాదు. రీల్‌ వృక్షంగా చాలా సినిమాల్లో కనిపించింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి నిన్నమొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్‌ మూవీ. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం.

ఒక ఊరికి పేరు వచ్చిందంటే వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తు ఎదగాలి. లేదా ఏదైనా ఘనకార్యం చేసి ఉండాలి. కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని, అది కూలిపోవడం బాధ కలిగిస్తోందంటున్నారు కుమారదేవం గ్రామస్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..