AP News: చెప్తే వినరు.. RTC బస్‌లో తల బయటకు పెట్టిన ఇంటర్ విద్యార్థి..! ఏం జరిగిందంటే
బస్సులు, కారుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు, తలలు బయటకు పెట్ట వద్దని పెద్దలు ఎన్ని సార్లు చెప్పినా కొందరు వినిపించుకోరు. దీంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ఓ బస్సు కిటీకీ సీటులో కూర్చున్న ఓ ఇంటర్ విద్యార్ధి అనుకోని విధంగా దుర్మరణం చెందాడు...

ముమ్మిడివరం, జనవరి 28: బస్సులో ప్రయాణించేటప్పుడు చేతులు, తలలు బయటకు పెట్ట వద్దని పెద్దలు ఎన్ని సార్లు చెప్పినా కొందరు వినిపించుకోరు. దీంతో నిర్లక్ష్యంగా ప్రమాదకర రీతిలో బస్సు కిటీకీల వద్ద సీటుల్లో కూర్చుని ప్రయాణిస్తుంటారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఇంటర్ విద్యార్ధి అనుకోని విధంగా దుర్మరణం చెందాడు. కిటికీ సీటు వద్ద కూర్చున్న విద్యార్ధి తల బయటకు పెట్టాడు. కాసేపటికే దారుణం చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టోల్గేట్ వద్ద బుధవారం (జనవరి 28) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వివరాల్లోకెళ్తే..
కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఆర్టీసీ బస్ లో ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తుంది. ఇందులో కాలేజీలు, బడులు, ఉద్యోగ వ్యాపారాలకు వెళ్తే రకరకాల ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు టోల్ గేట్ వద్ద బస్ వెల్లుతుండగా ఆర్టీసీ బస్ కిటికీలో నుంచి ఓ ఇంటర్ విద్యార్థి తల బయటకు పెట్టాడు. అక్కడ కొద్ది సేపు ఆగిన బస్సు ఆ వెంటనే బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు ముందుకు కదలడంతో టోల్ గేట్ కేబిన్ రాడ్ విద్యార్ధి తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్ర గాయాల పాలైన విద్యార్ధిని 108 అంబులెన్స్ లో హుటాహుటీన అమలాపురం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్లో తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే విద్యార్ధి మృతి చెందాడు.
టోల్గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మురమళ్ల నుండి అమలాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సులో మార్గం మధ్య లో బాధిత విద్యార్ధి బస్ ఎక్కాడు. అమలాపురం కాలేజీ కి విద్యార్థి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.




