AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర కరలాడే కార్న్‌ఫ్లోర్ టిక్కీ ఇలా చేసుకుని తింటే.. టేస్ట్ అదిరిపోతుంది!

ఈ కార్న్‌ఫ్లోర్ టిక్కీలు అందరికీ ఫేవరేట్ ఫుడ్. దీనిని మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం వరకు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే రుచికరంగా చేసుకోవచ్చు. అయితే, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 28, 2026 | 11:39 AM

Share
కార్న్‌ఫ్లోర్ టిక్కీ గురించి మీరు వినే ఉంటారు. ఇది తినడానికి మంచి స్నాక్స్. సాయంత్రం సమయంలో వీటిని చేసుకుని తింటే ఆ ఫీలింగే వేరు. దీనిని మీ ఇంట్లో ఉండే వాడే  పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు.

1 / 5

కావాల్సిన పదార్థాలు:  స్వీట్ కార్న్ ఒక కప్పు,  2 టేబుల్ స్పూన్స్  నూనె,  3  టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్,  బంగాళాదుంప 1,  పచ్చిమిర్చి ముక్కలు,  ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక  టీస్పూన్ కారం.

2 / 5

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక ఉడికించిన బంగాళాదుంప వేసి, ఆ తర్వాత దానిలో స్వీట్ కార్న్‌ , కార్న్‌ఫ్లోర్, మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, .సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు, మీ చేతులకు వంట నూనెను కొద్దిగా రాసి టిక్కీలుగా చేసుకోండి.

3 / 5
ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద  పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్  నూనె వేసి అది వేడయ్యాక టిక్కీలను ఒక దాని తర్వాత ఒకటి  పాన్ మీద పెట్టి, వాటిని ఇరు వైపులా రంగు మారే వరకు బాగా వేయించండి. అంతే, వేడి వేడి  కార్న్‌ఫ్లోర్ టిక్కీలు రెడీ. వీటిని గ్రీన్ చట్నీతో తింటే రుచికరంగా ఉంటాయి.

4 / 5
బయట వాటితో కాకుండా ఇంట్లో ఉండే  పదార్థాలతోనే  చేసుకుంటాము కాబట్టి, ఇవి స్నాక్స్ కంటే రుచిగా ఉంటాయి. పిజ్జా, బర్గర్ తినే కన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు, ఈ రెసిపీ మన అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

5 / 5