AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ

Phani CH
|

Updated on: Jan 28, 2026 | 12:35 PM

Share

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో చిరంజీవి నటిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి 'స్పిరిట్'లో భాగం కాదని, ఇవన్నీ కేవలం అపోహలేనని తేలింది. 'శంకరవరప్రసాద్' వంటి విజయాల తర్వాత చిరంజీవి ప్రధాన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అభిమానులు ఆయనను వింటేజ్ పాత్రల్లో చూడటానికే ఇష్టపడుతున్నారని ఈ కథనం వివరిస్తుంది.

స్పిరిట్ సినిమాలో చిరంజీవి నిజంగానే నటిస్తున్నారా..? ప్రభాస్ సినిమాలో గెస్టుగా మారడానికి మెగాస్టార్ ఓకే అన్నారా..? అందులోనూ శంకరవరప్రసాద్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరొకరి సినిమాలో మెగా అప్పీయరెన్స్ అభిమానులు ఒప్పుకుంటారా..? స్పిరిట్‌లో చిరంజీవి అనే వార్తలో నిజమెంత..? సందీప్ కాదన్నాక ఇంకా ఈ రూమర్స్ ఎందుకు..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. చిరంజీవి.. ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది.. చుట్టూ ఒక ఆరా ఉంటుంది.. ఇమేజ్ రీ సౌండింగ్ వస్తుంది. ఒకటి రెండు కాదు.. 48 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఛాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్. ఆయనతో సినిమా చేయాలని కలలు గనే దర్శకులు ఎంతోమంది. అలాంటి స్టార్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారంటే నమ్మడం సాధ్యమేనా..? సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో ఇలా డ్యూయెట్లు పాడతారు..? వాళ్లు కూడా వయసుకి తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి. అది చిరంజీవికి వర్కవుట్ కాదని శంకరవరప్రసాద్ సక్సెస్‌తో అర్థమైపోయింది. 70 ఏళ్లలోనూ చిరును వింటేజ్ పాత్రలో చూడ్డానికే ఆడియన్స్ ఇష్టపడుతున్నారని ఈ విజయమే నిరూపించింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్‌లో చిరంజీవి ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదేం లేదని.. తన సినిమాలో మెగాస్టార్ లేరని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు వంగా. అయినా కూడా మరోసారి ఈ కాంబినేషన్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. స్పిరిట్‌లో చిరంజీవి నటిస్తున్నారనేది పూర్తిగా అబద్ధమే అని మేకర్స్ కొట్టి పారేసారు. స్పిరిట్ విషయానికి వస్తే.. ఇప్పటికే షూట్ మొదలైంది. 2027 మార్చి 5న విడుదల కానుంది. కాకపోతే యానిమల్‌లో అనిల్ కపూర్ తరహాలో స్పిరిట్‌లోనూ ఓ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మెగాస్టార్ ఇన్ స్పిరిట్ అనేది అపోహలే.. అందులో ఏమాత్రం నిజం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు

Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్

Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్