హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే
టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమా విజయం సాధించిన దర్శకులకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వడం కొత్త ట్రెండ్‌గా మారింది. చిరంజీవి అనిల్ రావిపూడికి, పవన్ కళ్యాణ్ సుజీత్‌కు, విశ్వప్రసాద్ తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేనికి కార్లు బహుకరించారు. తమిళంలోనూ రజనీ, నెల్సన్‌లకు కళానిధి మారన్ కార్లు ఇచ్చారు. ఇది సినిమా విజయానికి స్టార్స్ చూపే గొప్ప కృతజ్ఞత.
హిట్టు కొట్టు.. కార్ పట్టు.. ఇదేంటి ఏదైనా కొత్త కాంటెస్ట్ రన్ చేస్తున్నారా అనుకోవద్దు.. ఇదెక్కడో బయట కాదు ఇండస్ట్రీలోనే రన్ అవుతున్న కాంటెస్ట్. హిట్టు ఇచ్చిన దర్శకులను గుర్తు పెట్టుకుని మరీ.. వాళ్లకు లగ్జరీ కార్లు ఇచ్చి తమ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు హీరోలు, నిర్మాతలు. టాలీవుడ్‌లోనే కాదు.. తమిళంలోనూ ఇదే ట్రెండ్ నడుస్తుందిప్పుడు. చూస్తున్నారుగా.. మెగా గిఫ్ట్ అందుకున్న తర్వాత అనిల్ ఆనందాన్ని..! మన శంకరవరప్రసాద్ గారుతో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న అనిల్ రావిపూడికి అంతే ప్రేమతో రేంజ్ రోవర్ కార్ గిఫ్టుగా ఇచ్చారు చిరు. కొన్నేళ్లుగా తాను బాగా మిస్సైన కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను శంకరవరప్రసాద్‌తో తట్టి లేపారు అనిల్. అందుకే కృతజ్ఞతగా కార్ ఇచ్చారు చిరు. మన శంకరవరప్రసాద్ గారు సృష్టించిన రికార్డుల్ని చూసాక.. అనిల్ రావిపూడికి కార్ కాదు ఇంకేం ఇచ్చినా తక్కువే అనిపిస్తుందేమో..? రీజినల్ సినిమాల్లో మొదటి 350 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. అలాగే ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరు మాత్రమే కాదు.. ఆ మధ్య OG టైమ్‌లో సుజీత్‌కు లగ్జరీ కారు ఇచ్చారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్‌ను చాలా ఏళ్లుగా ఊరిస్తున్న విజయాన్ని ఓజితో ఇచ్చారు సుజీత్. షూటింగ్ సమయంలో తన కార్ అమ్మి జపాన్ షెడ్యూల్ పూర్తి చేసారని తెలుసుకుని సుజీత్‌కు అదే మోడల్ కారును గిఫ్టుగా ఇచ్చారు పవన్. ఇక గతేడాది మిరాయ్ సినిమా హిట్‌కు గుర్తుగా హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి కార్లు ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. రేపు పెద్ది హిట్టైతే బుచ్చిబాబుకు రామ్ చరణ్ కూడా కారు గిఫ్ట్‌గా ఇచ్చి ట్రెండ్ కంటిన్యూ చేస్తారేమో చూడాలి. కేవలం తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ ట్రెండ్ నడుస్తుంది. సత్యం సుందరం సక్సెస్ అయినపుడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కు కార్తీ.. జైలర్ విజయం సాధించినపుడు రజినీ, నెల్సన్‌కు కళానిధి మారన్ లగ్జరీ కార్లు గిఫ్టుగా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు
Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం
99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ
Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

