AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్

Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 12:28 PM

Share

లోకేష్ కనకరాజ్ తన కెరీర్ నెమ్మదించిందని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు, తనే బ్రేక్ తీసుకున్నానన్నారు. LCU కొనసాగుతుందని, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వస్తాయని స్పష్టం చేశారు. 'కూలీ' లాభదాయకమని, 'A' సర్టిఫికేట్ వల్ల 40-50 కోట్లు తగ్గినా నిర్మాతలకు లాభం చేకూర్చిందన్నారు. ఖైదీ 2 ఆలస్యానికి అధిక రెమ్యునరేషన్ కాదని, బన్నీ సినిమా అని వివరించారు. లారెన్స్ 'బెంజ్' కూడా LCUలో భాగమేనని వెల్లడించారు.

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ కెరీర్ ఉన్నట్లుండి స్లో అయిపోయిందనేది కాదనలేని నిజం. కానీ ఆయన మాత్రం మరోలా చెప్తున్నారు. తానే బ్రేక్ తీసుకున్నానన్నారు. అంతేకాదు.. ఆగిపోయిందని వస్తున్న LCUపై కూడా పీక్ అప్‌డేట్ ఇచ్చారు లోకేష్. అన్నీ ఉన్నాయి.. తగ్గేదే లే అంటున్నారు లోకేష్. మరి ఈయన కాన్ఫిడెన్స్ ఏంటి.. నెక్ట్స్ ప్లాన్ ఏంటి..? కూలీ సినిమా తన నిర్మాతలకి ప్రాఫిటిబుల్ వెంచర్ అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు లోకేష్ కనకరాజ్.. A సర్టిఫికేట్ కారణంగానే ఈ సినిమాకు 40 నుంచి 50 కోట్లు తక్కువచ్చాయనేది లోకేష్ వాదన. ఇక ఖైదీ 2 ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చారీయన. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినందుకే ఈ సినిమా ఆగిపోయిందని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అది నిజం కాదన్నారు లోకేష్. లోకేష్ కనకరాజ్ ఎన్ని సినిమాలు చేసినా.. ఆయనకు ఖైదీ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే ఈ దర్శకుడు ప్రపంచానికి పరిచయమైందే ఖైదీతో.. ఆ తర్వాతే మాస్టర్, లియో అంటూ స్టార్ డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఖైదీ 2 కోసం తానెందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతాను.. అల్లు అర్జున్ సినిమా కారణంగానే ఖైదీ 2 కాస్త వాయిదా వేసానని చెప్పారు లోకేష్. LCU ఉంటుందని.. బన్నీ ప్రాజెక్ట్ తర్వాత ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, రోలెక్స్ కూడా ఉంటాయన్నారు లోకేష్ కనకరాజ్. లారెన్స్ హీరోగా వస్తున్న బెంజ్ సినిమా కూడా LCUలో భాగమే అన్నారు ఈ దర్శకుడు. ఇక రజినీ, కమల్ మల్టీస్టారర్ చేసే ఛాన్స్ వచ్చినా.. వాళ్లు ఎంటర్‌టైనింగ్ కథ కావాలని కోరడంతో.. అలాంటి కథ చేయలేనని తానే గౌరవంగా తప్పుకున్నట్లు తెలిపారు లోకేష్ కనకరాజ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్

AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్

Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ

Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్

Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్