చాలా సింపుల్‌గా.. ఇంటిలోనే జిలేబీ ఎలా చేయాలో చూసెయ్యండి!
Samatha
28 January 2026
చాలా మంది ఇష్టపడే స్వీట్స్‌లో జిలేబీ ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరూ సీజన్‌తో సంబంధం లేకుండా చాలా ఇష్టంగా జిలేబీని తింటుంటారు.
స్వీట్
అయితే ఇప్పుడు మనం ఇంటిలోనే స్వీట్ అండ్ టేస్టీ జిలేబీని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. దీని కోసం కావాల్సిన పదార్థాలు ఏవో తెలుసుకుందాం.
జిలేబీ తయారీ
జిలేబీ తయారు చేయడానికి శనగపిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ సోడా, పెరుగు, చక్కెర, ఏలకుల పొడి వన్ టీస్పూన్, వేయించడానికి సరిపడ నూనె.
కావాల్సిన పదార్థాలు
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి,మొక్కజొన్న పిండి, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు వేసి చిక్కటి ద్రావణంలా కలుపుకోవాలి. తర్వాత దీనిని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
చక్కడి ద్రావణం
ఇప్పుడు చక్కెర సిరప్ తయారు చేయడానికి ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని తీసుకొని దానిలో రెండు కప్పుల చక్కెర, ఏలకుల పొడి వేసి మరిగించాలి. కొంచెం పాకం రాగానే పక్కన పెట్టాలి.
పాకం తయారీ
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో జిలేబీలు వేయించడానికి సరిపడ నూనె పోయాలి. అది వేడి అవ్వగానే, మనం ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబీ పిండి తీసుకోవాలి.
జిలేబీ తయారీ
దీనిని జిలేబీ కోన్ ద్వారా జిలేబీ ఆకారంలో ఒత్తుకోవాలి. తర్వాత ఈ జిలేబీలను పాన్‌లో వేసి వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
నూనెలో వేయించడం
తర్వాత ఈ జిలేబీలను మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న సిరప్‌లు వేస్తే అదిరిపోయే స్వీట్ అండ్ టేస్టీ జిలేబీలు రెడీ.