ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఏఐ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన ముఖం, స్వరాన్ని మార్ఫింగ్ చేశారని అకిరా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.