జ్ఞాపకశక్తి పెంచుకోవాలా నాయనా? వీటిని గుప్పెడు తినండి
28 January 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రయాణాల్లో పల్లీలు తింటే భలే మజాగా ఉంటుంది. ఇవి రుచిగానూ ఉంటమేకాదు, ఆరోగ్యాన్నీ ఇస్తాయి. వేరుశనగపప్పుల్లో క్యాల్షియం, ఐరన్, కాపర్, ఫొలేట్, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉన్నాయి
TV9 Telugu
ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి
TV9 Telugu
వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి
TV9 Telugu
జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది. మూడ్స్‌ను క్రమబద్ధంచేసి, యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఎమినో యాసిడ్స్ పల్లీలు అందిస్తాయి. వాటివల్ల ఆందోళన తలెత్తదు
TV9 Telugu
వేరుశనగ ప్రొటీన్లు ఉన్న ఆహారం అయినందున ఆకలి తీరుతుంది. ఇంకా ఇంకా తినాలన్న భావన లేక సంతుష్టి కలుగుతుంది
TV9 Telugu
దాంతో బరువు పెరగరు. రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలెన్నో అందుతాయి, అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు
TV9 Telugu
పల్లీలను వేయించి తింటే మరింత రుచిగా ఉండే మాట నిజం. కానీ వీటిని ఉడికించి లేదా నానబెట్టి తినడమే మంచిది. మొలకలు వచ్చాక తింటే మరీ శ్రేష్ఠం
TV9 Telugu
వీటికి కొంచెం బెల్లం జతచేసి తింటే పైత్యం చేయదు. ఇన్ని లాభాలు చేకూర్చే పల్లీలను తగిన మోతాదులో తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి బాదం, జీడిపప్పులంత ఖరీదు కాదు కనుక అందరికీ అందుబాటులో ఉంటాయి