AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జరీ చేసింది. అకీరా నందన్ పై రూపొందించిన AI సినిమా కంటెంట్ ను ప్రసారం చేయోద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏఐ చిత్రం ,డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు
Akira Nandan
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 12:50 PM

Share

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది..అనుమతి లేకుండా అకీరా నందన్ పై రూపొందించిన AI సినిమా కంటెంట్ ను ప్రసారం చేయోద్దని ఆదేశాలు జారీ చేసింది. అకీరా నందన్ పేరు, గొంతు, ముఖకవళికలు, వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన కంటెంట్‌ ప్రసారంపై నిషేధం విధించింది. జస్టిస్ తుషార్ రావు గెదెలా నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.. ఏఐ లవ్ స్టోరీ అనే చిత్రంతో పాటు, అకీరా నందన్ గుర్తింపును వాడుతూ సోషల్ మీడియాలో ఉన్న ఇతర డీప్‌ఫేక్ కంటెంట్ ప్రచారాన్ని నిలపివేసింది..

యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు 11 లక్షలకు పైగా, ఇంగ్లీష్ వెర్షన్‌కు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. తన ప్రమేయం లేకుండానే ఏఐ మార్ఫింగ్, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సినిమాను రూపొందించి తనను ప్రధాన పాత్రలో చూపించారని పిటిషన్ లో అకీరా నందన్ ప్రస్తావించారు. అకీరా పేరుతో సోషల్ మీడియాలో అనేక ఫేక్ ప్రొఫైల్స్ ల్ క్రియేట్ చేసి, వాటి ద్వారా విరాళాలు సేకరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని అకీరా తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యలో ధర్మాసనం స్పందిస్తూ… అకీరా నందన్ అప్పుడే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారని వ్యాఖ్యానించింది.

అయితే ఏ వ్యక్తికైనా తమ పేరును, చిత్రాన్ని లేదా వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా ఇతరులు వాడుకోకుండా అడ్డుకునే పబ్లిసిటీ రైట్ ఉంటుందని పేర్కొంది. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకొని… అకీరాకు సంబంధించి సోషల్ ప్లాట్ ఫ్లాంలపై షేర్ చేసిన అన్నీ కంటెంట్ లను తొలగించాలని ఆదేశించింది. సదరు ఫేక్ కంటెంట్‌ను సృష్టించిన వ్యక్తుల ఐపీ అడ్రస్‌లు, అకౌంట్ వివరాలను వెల్లడించాలని కోర్టు ప్రతివాదులను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..